వంటింటి నుంచి అంతరిక్షం వరకు మహిళలు అన్ని రంగాల్లో దూసుకు పోతున్నారు. విద్యా ఉపాధి రంగాల్లో అవకాశాలు సృష్టించుకుంటూ ఆకాశమే హద్దుగా రాణిస్తున్నారు. సమాజంలో ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారు.
ఆడదంటే అబల కాదు సబల అని నిరూపిస్తున్నారు. ఇదే అంశానికి చెందిన ఓ మహిళ డ్రైవర్ వృత్తిలో చేరి నేటి తరానికి ఆదర్శంగా నిలిచింది. ఆమె తమిళనాడు కు చెందిన షర్మిల. కోయంబత్తూర్ లో తొలి మహిళా బస్సు డ్రైవర్ గా విధులు నిర్వహించి రికార్డు క్రియేట్ చేసింది. దీంతో ఆమెకు అన్ని వర్గాల నుంచి ప్రశంసలు దక్కాయి. అనతి కాలంలోనే సెలబ్రిటీగా మరిపోయింది. షర్మిల తో సెల్పీల కోసం యువత ఆసక్తి చూపింది. దీంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సోషల్ మీడియాలో వచ్చిన విపరీతమైన పబ్లిసిటీ అసలుకే ఎసరు పెట్టింది. తన ఉద్యోగం పోయేలా చేసింది. ఉద్యోగం కోల్పోయిన మహిళా డ్రైవర్ షర్మిలకు అగ్రకథానాయకుడు కమల్ హాసన్ అండగా నిలిచారు. ఓ విలువైన వస్తువును కానుకగా ఇచ్చారు. ఆ వివరాలు మీ కోసం..
కోయంబత్తూర్ లో కొన్ని నెలల క్రితం ఓ ప్రైవేట్ ట్రావెల్స్ కు చెందిన బస్సుకు తొలి మహిళా డ్రైవర్ గా షర్మిల విధులు నిర్వహించింది. దీంతో ఆమె వార్తల్లో వ్యక్తిగా నిలిచింది. సాధారణ వ్యక్తులతో పాటు రాజకీయ, సినీ ప్రముఖులు ఆమెను అభినందించారు. తండ్రి సాయంతో డ్రైవింగ్ నేర్చుకున్న ఆమె ఆ తర్వాత కొంతకాలం ఆటో కూడా నడిపింది. నేటి తరం యువతకు ఆదర్శంగా నిలిచిన షర్మిల సెలబ్రిటీగా మారిపోయింది. షర్మిల తో ఫొటోలు దిగేందుకు జనం ఎగబడ్డారు. మీడియా కూడా తన ఇంటర్య్వూల కోసం క్యూ కట్టింది. ఇంతటి బజ్ క్రియేట్ చేసిన డ్రైవర్ షర్మిల తాజాగా తన ఉద్యోగాన్ని పోగొట్టుకుంది. ఎంపి కనిమొళి ఇటీవల షర్మిల నడిపే బస్సు ఎక్కి ఆమెను అభినందించింది. ఆ సమయంలో మహిలా కండక్టర్ కనిమొళిని టికెట్ తీసుకోవాలని కోరింది.
తనను కలిసేందుకు వచ్చిన ప్రముఖ వ్యక్తిని అవమానించిందని, అంతే కాకుండా యాజమాన్యం కూడా సొంత పబ్లిసిటి కోసం ప్రముఖ వ్యక్తులను బస్సులోకి ఆహ్వానిస్తున్నట్లు అవమానించిందని ఆరోపిస్తూ తన ఉద్యోగానికి రాజీనామా చేసింది. ఈ విషయం తెలుసుకున్న నటుడు కమల్ హాసన్ షర్మిలకు అండగా నిలిచారు. యువతకు ఆదర్శంగా నిలిచిన ఆమెకు సాయం అందించేందుకు ముందుకొచ్చారు. కమల్ కల్చరల్ సెంటర్ ద్వారా కారును షర్మిలకు గిఫ్టుగా అందించారు. ఈ సందర్భంగా కమల్ మాట్లాడుతూ.. అందరికి స్ఫూర్తిగా నిలిచిన మహిళా డ్రైవర్ షర్మిల డ్రైవర్ గానే ఉండిపోకూడదు, ఎంతో మంది షర్మిలలను తయారు చేయాలని ఆకాంక్షించారు. ఆమె వ్యాపారవేత్తగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ஆண்டாண்டு காலமாய் அடக்கிவைக்கப்பட்ட பெண்கள் தங்கள் தளைகளை உடைத்து தரணி ஆளவருகையில் ஒரு பண்பட்ட சமூகமாக நாம் அவர்களின் பக்கம் நிற்க வேண்டும் – தலைவர் நம்மவர் @ikamalhaasan #KamalHaasan #Coimbatore #Sharmila pic.twitter.com/guJUhzuGpl
— Makkal Needhi Maiam | மக்கள் நீதி மய்யம் (@maiamofficial) June 26, 2023