రాజకీయ వేదికలు, కార్యక్రమాలు, ఎన్నికల ప్రచారాలు అంటే ఎక్కువగా ప్రత్యర్థి పార్టీ నేతలపై విరుచుకుపడటం, వారిపై విమర్శలు చేయడం వంటివే చోటు చేసుకుంటాయి. ఇక ఈ మధ్య కాలంలో మహిళా నేతలని కూడా చూడకుండా.. బూతులు వాడుతున్న సంఘటనలను చూస్తూనే ఉన్నాం. పైగా ఎంత బాగా బూతులు తిడితే.. అంత గొప్ప అన్నట్లు తయారయ్యారు కొందరు నేతలు. ఇక మహిళా నాయకురాళ్లు కూడా మేమేం తక్కువ అన్న రేంజ్‌లో తిట్ల దండకం మొదలుపెడుతున్నారు. అయితే అందరు ఇలానే ఉండరు. చాలా మంది నేతలు ఎంతో పద్దతిగా, కచ్చితంగా, నొప్పించక తానొవ్వక అన్నట్లు తాము చెప్పదల్చుకున్న దాన్ని చెప్తారు. మరి కొందరు నేతలు మహిళ పట్ల అపార గౌరవాన్ని ప్రదర్శిస్తారు.
ఇక సాధారణంగా రాజకీయాల్లో.. ప్రత్యర్ధులు తారసపడినప్పుడు ఒకరికి మరొకరు నమస్కారాలు చేసుకోవడం, కుర్చిల్లోంచి నిలబడి గౌరవం ఇవ్వడం వంటివి సహజంగా చోటుచేసుకునే సంఘటనలు. కాని జార్ఖండ్‌లో జరిగిన ఓ సంఘటన మాత్రం ఇప్పుడు విస్తృతంగా వైరల్ అవుతోంది. ఎందుకంటే సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి.. మహిళా ఎమ్మెల్యేకి పాదాభివందనం చేయడంపై సర్వత్రా ఆసక్తికర చర్చ కొనసాగుతోంది.
జార్ఖండ్‌లోని మందార్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరుగుతోంది. ఈసందర్భంగా పార్టీల తరపున నామినేషన్ వేసే ప్రక్రియ కొనసాగుతోంది. ఇందులో భాగంగానే రాంచీ డీసీ కార్యాలయంలో మహాకూటమి నేతలు భేటీ అయ్యి మాట్లాడుకుంటున్నారు. మహాకూటమికి చెందిన పెద్ద నేతలంతా కాంగ్రెస్ అభ్యర్థి శిల్పి నేహా టిర్కీ నామినేషన్‌లో పాల్గొన్నారు. జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌తో పాటు కాంగ్రెస్ నేతలంతా నామినేషన్ హాలు బయట కూర్చున్నారు. అదే సమయంలో జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ తన హోదాని సైతం పక్కనపెట్టి సంప్రదాయం ప్రకారం.. కాంగ్రెస్ మహిళ ఎమ్మెల్యేకి రెండు చేతులు జోడించి నమస్కారం చేశారు. అంతటితో ఆగకుండా ఆమె పాదాలకు వందనం చేశారు.
ఇది కూడా చదవండి: MS Dhoni: జార్ఖండ్ పంచాయితీ ఎన్నికల్లో ధోని! అసలు మ్యాటర్ ఏమిటింటే?
భారతీయ సంస్కృతిలో మహిళల్ని గౌరవించాలన్న మాట ప్రకారం సీఎం హేమంత్ సోరెన్ ఈ విధంగా నమస్కారం చేసి తన గొప్ప తనాన్ని చాటుకున్నారు అంటున్నారు ఈ వీడియో చూసిన వారు. ఇక దీనిలో ఉన్న ప్రకారం.. హేమంత్ సోరెన్ రాజేష్ ఠాకూర్‌తో మాట్లాడుతున్న సమయంలో దీపికా పాండే సింగ్ రావడంతో చేతులు జోడించి నమస్కరించి, ఆపై ఆమెకు పాదాభివందనం చేశారు సీఎం. ఈ చర్యతో సదరు మహిళా ఎమ్మెల్యేతో పాటు.. అక్కడున్నవారు సైతం ఆశ్చర్యపోయారు.
ఇది కూడా చదవండి: Jharkhand: వీడియో: గిరిజన బాలికపై దారుణానికి ఒడిగట్టిన యువకుడు.. విషయం సీఎంకి తెలిసింది!
ఇక ఈ వీడియో చూసిన సోషల్ మీడియా ఫాలోవర్స్ ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే నిజమైన రాజకీయ నాయకుడు అంటూ హేమంత్ సొరేన్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: EVV Satyanarayana: గోదారోళ్ల కితకితలు ఫేస్ బుక్ పేజ్ అడ్మిన్ EVV మృతి!