ఒకప్పుడు తమిళనాడులో సీఎం జయలలిత అంటే ఎంతో గొప్ప పేరు ఉండేది. నటిగానే కాకుండా రాజకీయాల్లో తన మార్క్ చాటుకున్నారు. ప్రత్యర్థులు ఎలాంటి వారైనా.. ఎన్ని కుట్రలు పన్నినా సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. అందరిచే అమ్మా అని పిలుపించుకున్న చివరి రోజుల్లో ఆసుపత్రిలో ఎంతో దుర్భరమైన.. బాధాకర పరిస్థితులు ఎదుర్కొన్నట్లు ఆరుముగస్వామి కమిషన్ నివేదికలో సంచలన నిజాలు వెల్లడయ్యాయి.
తమిళనాడులో జయలలిత అంటే పార్టీ పరంగా కాదు.. ఆమె వ్యక్తిత్వానికి ఎంతో గౌరవం ఇచ్చేవారు. జయలలిత సీఎం గా ఉన్న సమయంలో ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకున్నారు.. ప్రజా సంక్షేమం కోసం ఎన్నో పథకాలు ఆమె అమల్లోకి తీసుకు వచ్చారు. కానీ చివరి రోజుల్లో మాత్రం ఆమె మరణం ఒక మిస్టరీగానే మారిపోవడంతో అందరూ ఆమె మరణం గురించిన వాస్తవాలు తెలుసుకోవాలని కోరారు. ఈ నేపథ్యంలోనే సీఎం స్టాలిన్ ప్రభుత్వం ఆర్మగం కమిటీని నియమించింది. జయలలిత ఆస్పత్రికి ఎలాంటి పరిస్థితిలో వచ్చింది.. ఎలాంటి బాధనలు, నరకం అనుభవించింది అనేవిషయంపై వివరణ ఇచ్చారు.
ఒక అధికారిక కార్యక్రమంలో జయలలితకు కళ్లు తిరగడంతో ఆమె ఆపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. 2016 సెప్టెంబర్ 22 రాత్రి సమయంలో ఆమెను ఆస్పత్రిలో చేర్పించారు. ఆమెకు పలు అనారోగ్య సమస్యలు రావడంతో స్టెరాయిడ్స్ ఇచ్చి కొంత వరకు కంట్రోలో చేయగలిగారు. తర్వాత ఆమెకు పలు అనారోగ్య సమస్యలు బయట పడటం మొదలయ్యాయి. జయలలితకు వెంటిలేటర్ పై చికిత్స ఇవ్వడం మొదలు పెట్టారు. అక్టోబర్ 19న ఆమె కాస్త మాట్లాడే స్థితికి వచ్చారు. అదే విధంగా సంజ్ఞలకు స్పందించడం లాంటివి చేసింది. కానీ ఆమె కండరాల్లో బలహీనత వల్ల మరికొంత చికిత్స అందించాల్సి ఉంటుందని డాక్టర్లు భావించారు.
ఈ క్రమంలోనే జయలలితకు పలు మార్లు వివిధ రకాల చికిత్సలు ఆమెకు అందిస్తూ వచ్చారు. దాంతో ఆమెకు బాగా విసుగు పుట్టింది. వైద్యులు చేసే చికిత్సకు తట్టుకోలేక నరకం అనుభవించిందని నివేధికలు తెలిపారు. ఆ సమయంలో జయలలిత ఎంతో ఆవేదనకు గురై నేను ఇంటికి వెళ్తా నన్ను ఇంటికి పంపించండి అంటూ వెంటిలేటర్ ని తీసి బాధపడ్డారట. ఆమెకు వెంటిలేటర్ తప్పని సరి అవసరం అని వైద్యులు ఎంతగానో నచ్చజెప్పిన తర్వాత ఆమె మనసు మార్చుకున్నారని ఆర్ముగం నివేధికలో తెలిపారు.రెండున్నర నెలల పాటు ఆసుపత్రిలోనే గడిపిన జయలలిత ఆ సమయంలో భక్తి పాటలు వింటూ, ఆసుపత్రి గదిలో ఏర్పాటు చేసిన దేవుళ్ల చిత్ర పటాలు చూస్తూ గడిపినట్టు అర్ముగస్వామి కమిషన్ నివేదికలో పేర్కొన్నారు. 2019 డిసెంబర్ 5న ఆమె తుది శ్వాస విడిచారు.