సాధారణంగా కంపెనీలు అంటే తమ అభివృద్ధి కోసం మాత్రమే పని చేస్తుంటాయి. ఉద్యోగులకు టార్గెట్ ఇచ్చి మరి.. పని పూర్తి చేయిస్తుంటాయి. కానీ కొన్ని కంపెనీలు మాత్రం సంస్థ అభివృద్ధితో పాటు అందులోని ఉద్యోగుల బాగోగులు చూసుకుంటాయి. వారిని తమ కుటుంబ సభ్యులుగా భావించి కడుపున పెట్టుకుని చూసుకుంటాయి. కంపెనీ అభివృద్ధి కోసం కృషి చేసే వారిని గుర్తించి.. ప్రత్యేక బహుమతులు ఇస్తుంటాయి. తాజాగా ఓ ఐటీ సంస్థ కూడా తమ ఉద్యోగుల శ్రమను గుర్తించి.. బంపర్ ఆఫర్ ప్రకటించింది. వందమందికి అదిరిపోయే బహుమతులు ఇచ్చింది సదరు సంస్థ. అసలు ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం..
తమిళనాడులోని చెన్నై కేంద్రంగా ఐడియాస్-2IT అనే ఐటీ సంస్థ పనిచేస్తుంది. ఇది ఓ సాఫ్ట్ వేర్ సోల్యూషన్ కంపెనీ. ఈ కంపెనీ భారత్ తో పాటు.. అమెరికా, మెక్సీకో సహా పలు దేశాల్లో తన కార్యకలపాలను విస్తరించింది. అయితే ఈ కంపెనీ ఇంతలా అభివృద్ది చెందడానికి కారణం ఆ సంస్థలోని ఉద్యోగుల కృషి. కొద్ది మందితో ప్రారంభమైన ఈ సంస్థ ఇప్పుడు 500 మంది ఉద్యోగుల పనిచేసే స్థాయికి ఎదిగింది. కంపెనీ అభివృద్ధికి కృషి చేసిన ఐదుగురు టాప్ మేనేజ్ మెంట్ సిబ్బందికి ఇటీవలే సరికొత్త BMW కార్లను బహుమతిగా ఇచ్చింది. ఈ క్రమంలో తాజాగా కంపెనీ అభివృద్ధికి కృషి చేసిన మరో 100మంది ఉద్యోగులకు మారుతీ సుజుకీ కార్లను బహుమతిగా ఇచ్చింది.
కార్లను బహుకరించడం ఆనందంగా ఉందని, సంస్థ అభివృద్ధికి సదరు ఉద్యోగులు కీలకంగా సేవలందించారని ఐడియాస్-2IT సంస్థ ఛైర్మన్ మురళీ వివేకానందన్ తెలిపారు. కంపెనీ అభివృద్ధికి ఉద్యోగులు ఎన్నో ప్రయత్నాలు చేశారని సీఈవో గాయత్రి వివేకానందన్ తెలిపారు. ఈ కార్లను బహుమతిగా ఇవ్వడం మొదటి అడుగు మాత్రమేనని భవిష్యత్ లో మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని తాము ప్రణాళిక రచిస్తున్నామన్నారు. మరి.. ఉద్యోగుల కృషిని గుర్తించి.. ఇలా బహుమతులు ఇస్తున్న ఈ సంస్థపై మీ అభిప్రాయలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Tamil Nadu | An IT firm, Ideas2IT, in Chennai, gifts 100 cars to 100 of its employees
“It’s always great to receive gifts from the organization; on every occasion, company shares its happiness with gifts like gold coins, iPhones. Car is a very big thing for us,” said an employee pic.twitter.com/iiTF9NHIJ7
— ANI (@ANI) April 11, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.