ప్రపంచ దేశాలతో పోటీ పడుతూ భారత శాస్త్రవేత్తలు ఎన్నో అద్భుతాలు సృష్టిస్తున్నారు. భారత అంతరిక్షపరిశోధన సంస్థ ఇస్రో మరో విజయాన్ని సాధించింది. చంద్రయాన్-3 విజయవంతంగా చందమామ కక్ష్యలోకి ప్రవేశించింది.
భారత అంతరిక్షపరిశోధన సంస్థ ఇస్రో అద్భుతాన్ని సృష్టించింది. ఇప్పటి వరకు ఎన్నో అంతరిక్ష ప్రయోగాలు విజయవంతంగా చేసింది. ఇక 2023 జూలై 14 న మధ్యాహ్నం 2:35 గంటలకు చంద్రయాన్ 3 ప్రయోగం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రయోగించారు. శ్రీహరికోట, సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం లోని రెండవ ప్రయోగ వేదిక నుండి ఎల్‌విఎమ్-ఎమ్4 వాహక నౌక ద్వారా ప్రయోగించారు. ఇస్రో చేపట్టిన చంద్రయాన్-3లో అత్యంత కీలక ఘట్టం పూర్తైంది. దాదాపు 22 రోజుల జర్నీ అనంతరం నేడు చంద్రయాన్-3 విజయవంతంగా చందమామ కక్ష్యలోకి ప్రవేశించింది. ఈ మేరకు ఇస్రో దీనిపై ట్వీట్ చేసింది.
చంద్రుడి దక్షిణ ధ్రువంపై పరిశోధనల కోసం భారత అంతరిక్ష సంస్థ ఇస్రోపంపింది చంద్రయాన్ -3 ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. దాదాపు 22 రోజుల జర్నీ తర్వాత చంద్రయాన్-3 ఎలాంటి ఆటంకాలు లేకుండా చందమామ కక్ష్యలోకి ప్రవేశించింది. శనివారం రాత్రి 7 గంటల ప్రాంతంలో ఇస్రో శాస్త్రవేత్తలు చంద్రయాన్ – 3ని ప్రవేశపెట్టే దశను విజయంతంగా పూర్తి చేశారు. ఆగస్టు 6న రాత్రి 11 గంటల సమయంలో చంద్రయాన్-3 కక్ష్యను ఇస్రో తగ్గించనుంది. కాగా, చంద్రుడిపై లాంచ్ అయే సమయానికి విక్రమ్ ల్యాండర్ సొంతంగా నిర్ణయాలను తీసుకోగలదని ఇస్రో తెలిపింది.
గతంలో చంద్రయాన్ – 2 మిషన్ ల్యాండ్ అయ్యే సమయంలో చంద్రుడి ఉపరితలాన్ని ఢీ కొట్టింది.. దీంతో అందులో ఉన్న వ్యవస్థ ఏదీ పనిచేయకుండా పోయింది. ఇప్పుడు చంద్రయాన్ – 3 వేరు విక్రమ్ ల్యాండర్ సొంతంగా నిర్ణయాలను తీసుకుంటుంది… ఇదే ప్రధానమైన తేడా అని చెప్పింది ఇస్రో. ఇక నుంచి వ్యౌమనౌక జాబిల్లి చుట్టూ చక్కర్లు కొట్టనుంది. బెంగుళూరు లో ఉన్న ఇస్రో టెలీమెట్రీ, ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్‌వర్క్ నుంచి ఈ విన్యాసాన్ని చేపట్టినట్టు ఇస్రో అధికారులు తెలిపారు. మొదటి క్షక్ష్య తగ్గింపు విన్యాసాన్ని రేపు రాత్రి 11 గంటలకు చేపట్టనున్నట్లు తెలిపింది. దశల వారీగా కక్ష్యను తగ్గిస్తూ.. జాబిలి దగ్గరకు వ్యౌమనౌకను చేరనుందని అన్నారు. ఈ మేరకు ఇస్రో దీనిపై ట్వీట్ చేసింది.
Chandrayaan-3 Mission Update:
Lunar Orbit Insertion (LOI) maneuver was completed successfully today (August 05, 2023). With this, #Chandrayaan3 has been successfully inserted into a Lunar orbit.
The next Lunar bound orbit maneuver is scheduled tomorrow (August 06, 2023), around… pic.twitter.com/IC3MMDQMjU
— LVM3-M4/CHANDRAYAAN-3 MISSION (@chandrayaan_3) August 5, 2023
ISRO tweets, “Chandrayaan-3 has been successfully inserted into the lunar orbit. A retro-burning at the Perilune was commanded from the Mission Operations Complex (MOX), ISTRAC, Bengaluru. The next operation – reduction of orbit – is scheduled for Aug 6, 2023, around 23:00 Hrs.… pic.twitter.com/qup163DuXW
— ANI (@ANI) August 5, 2023