జీవితంలో ఎదగాలంటే చాలా కష్టపడాలి. కష్టానికి అదృష్టం కూడా తోడవ్వాలి. కొంతమంది కష్టపడకుండా అదృష్టంతో జీవితంలో పైకొస్తారు. కోటిలో ఒక్కరిని వరిస్తుంది అదృష్టం. దాని పేరే లాటరీ. సింపుల్ గా లాటరీ టికెట్ కొని అదృష్టాన్ని నమ్ముకుంటారు. అలా నమ్ముకున్న వారిలో ఒక్కరు మాత్రం కోటీశ్వరులైపోతారు. రాత్రికి రాత్రే ఆటో డ్రైవర్‌ని వరించిన అదృష్టం.. రూ.500 పెడితే 25 కోట్లు వచ్చాయన్న వార్తలు మనం తరచూ చూస్తూనే ఉంటాం. ఇలాంటి బంపర్ ఆఫర్లు మన జీవితాల్లో ఎందుకు రావని క్వశ్చన్ చేసుకుంటాం. అయితే మనకి ఇక్కడ లాటరీ ఇల్లీగల్ కాబట్టి మనకి అదృష్టం రాదు. మరి లాటరీ లీగల్ అయిన రాష్ట్రాల్లో టికెట్ కొనచ్చు కదా అని సందేహం మీకు వచ్చే ఉంటుంది. కేరళ లాటరీ టికెట్లను తెలుగు ప్రజలు కొనచ్చా? కేరళ లాటరీలో మన తెలుగోళ్లు కూడా కోట్లు గెలుచుకోవచ్చా? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకుందాం పదండి.
మన దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో లాటరీ లీగల్ అయితే, మరి కొన్ని రాష్ట్రాల్లో మాత్రం ఇల్లీగల్. 1998 లాటరీ నియంత్రణ చట్టం ప్రకారం.. కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు సొంత చట్టాన్ని రూపొందించుకునే అధికారం ఇచ్చింది. దీంతో దేశంలో కొన్ని రాష్ట్రాలు మాత్రమే లాటరీ చట్టబద్ధం. మిగతా రాష్ట్రాల్లో మాత్రం లాటరీపై నిషేధం ఉంది. ప్రైవేట్ సంస్థలు కూడా లాటరీని నిర్వహించకూడదు. ఇండియాలో కేవలం 13 రాష్ట్రాల్లో మాత్రమే లాటరీ లీగల్ గా నడుస్తోంది. అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, గోవా, కేరళ, మహారాష్ట్ర, మణిపూర్, మధ్యప్రదేశ్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, పశ్చిమ బెంగాల్, పంజాబ్, సిక్కిం రాష్ట్రాల్లో ఆయా ప్రభుత్వాలే స్వయంగా ఈ లాటరీ టికెట్లను విక్రయిస్తున్నాయి.
అయితే మన తెలుగు రాష్ట్రాల్లో లాటరీ ఇల్లీగల్. మన రాష్ట్ర ప్రభుత్వాలు లాటరీని ఇల్లీగల్ చేశాయి. అయితే మన తెలుగు వారు కేరళ లాటరీ టికెట్లను కొనే అవకాశం ఉందా? అంటే లేదనే చెప్పాలి. ఏ రాష్ట్రంలో లాటరీ ఆ రాష్ట్రానికే వర్తిస్తుంది. లాటరీకి చట్టబద్ధత లేని రాష్ట్రాల ప్రజలు పక్క రాష్ట్రానికి చెందిన లాటరీ టికెట్లను కొనేందుకు వీల్లేదు. అయితే ఇప్పుడు అంతా ఆన్ లైన్ అయిపోయింది కాబట్టి కేరళ లాటరీ టికెట్లు ఆన్ లైన్ లో కూడా అందుబాటులో ఉంటున్నాయి. అయితే కేరళలో సెటిల్ అయిన తెలుగు ప్రజలు అక్కడి లాటరీ టికెట్లను కొనుగోలు చేయొచ్చు. కానీ కేరళలో పర్యటించే టూరిస్టులకు మాత్రం లాటరీ టికెట్లు కొనే హక్కు లేదు. ఇటీవల కాలంలో ఏజెంట్లు కేరళ లాటరీ టికెట్లను ఆన్ లైన్ లో విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.
దీంతో కేరళ వెళ్లకుండా అక్కడి లాటరీ టికెట్లు కొనచ్చన్నమాట. అయితే ఇది రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. ఎందుకంటే లాటరీ కేవలం కేరళ రాష్ట్రానికి చెందిన ప్రజల కోసమే అని, లాటరీలో గెలుచుకునే ప్రైజ్ మనీ కూడా కేరళ వాసులకే అని కేరళ ప్రభుత్వం వెల్లడించింది. కాబట్టి ఆన్ లైన్ లో కేరళ లాటరీ టికెట్లు కొన్నా ప్రయోజనం ఉండదు. డబ్బులు పోతాయి తప్పితే మన తెలుగు రాష్ట్రాల వారికి అదృష్టం వరించే అవకాశం లేదు. కొన్నాళ్ల క్రితం హర్యానాకు చెందిన ఓ వ్యాపారి తిరువనంతపురం వెళ్ళాడు. అక్కడ ఓ ఏజెంట్ ద్వారా లాటరీ టికెట్ కొన్నాడు. రూ. కోటి లాటరీ గెలుచుకున్నాడు. అయితే ఆ ప్రైజ్ మనీ ఇచ్చేనందుకు కేరళ ప్రభుత్వ అధికారులు ఒప్పుకోలేదు. ఎందుకంటే లాటరీ, ప్రైజ్ మనీ కేవలం కేరళ వాసులకి మాత్రమే అని తేల్చి చెప్పారు.
దీంతో ఆ వ్యాపారి కంగుతిన్నాడు. దీన్ని బట్టి మనకి అర్ధమయ్యేది ఏంటంటే.. కేరళ లాటరీ టికెట్లను కొన్నా అరువే. ఆ రాష్ట్ర ఆదాయాన్ని పెంచడానికి తప్పితే పైసా ఉపయోగం లేదు. అయితే కేరళ కాకుండా పంజాబ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, అస్సాం, గోవా లాంటి రాష్ట్రాలు అక్కడి లాటరీ టికెట్లను ఏ రాష్ట్రం వారైనా కొనే అవకాశం కల్పిస్తున్నాయి. అయితే రిస్క్ ఎక్కువ ఉంటుంది, మోసాలు జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి తెలిసిన వాళ్ళ ద్వారా కొనుగోలు చేస్తే మంచిది. ఎహె ఈ లాటరీ టికెట్లు కొనడాలు, ప్యాస్ అవ్వడాలు మన వల్ల కాదు. శుభ్రంగా దేవుడిచ్చిన ఈ దేహంతో కష్టపడి, మేధస్సుతో డబ్బు సంపాదించాలని అనుకుంటే మిమ్మల్ని మించిన కింగు మరొకరు ఉండరు. మరి లాటరీలో వచ్చిన డబ్బులతో(మంది సొమ్ముతో) ఎదగడం కంటే సొంత కష్టార్జీతంతో ఎదిగితేనే కిక్ ఉందని మీలో ఎంతమంది నమ్ముతారో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.