పబ్జీ గేమ్ ద్వారా ప్రేమలో పడి భారత్‌కు వచ్చిన పాకిస్తాన్ మహిళ, ఆమె ప్రియుడిని యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అధికారులు ప్రశ్నిస్తున్నారు.
పాకిస్తాన్‌కు చెందిన సీమా గులాం హైదర్ పబ్జీ ఆడుతూ ఉత్తరప్రదేశ్ కు చెందిన సచిన్ మీనాతో ప్రేమలో పడింది. సీమ గులాం హైదర్ 30 సంవత్సరాల మహిళ. సచిన్ మీనా 22 ఏళ్ల యువకుడు. వీరిని టెర్రరిజం స్క్వాడ్ అధికారులు రహస్య ప్రదేశానికి తరలించి ప్రశ్నిస్తున్నారు. ఏడేళ్లలోపు ఉన్న నలుగురు పిల్లలతో ఎలాంటి వీసా లేకుండా అక్రమంగా నేపాల్ ద్వారా ఉత్తరప్రదేశ్‌కు చేరుకుంది. ఆమెను జూలై 4న పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెకు ఆశ్రయమిచ్చిన ప్రియుడు సచిన్ మీనాను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఐదు రోజుల తర్వాత వారిద్దరూ బెయిల్‌పై విడుదలై బయటికి వచ్చారు.
కాగా, 2019లో ఆన్‌లైన్ గేమ్ పబ్జీ ద్వారా వారి మధ్య పరిచయం అయినట్లు సీమా, సచిన్ మీడియా ముందు తెలిపారు. తాము ఇరువురు కలిసి జీవించేందుకు పోలీసులు, ప్రభుత్వం సహకరించాలని కోరుతున్నారు. తన భర్త హిందూ ఐతే ఆమె కూడా హిందువే అని సీమా చెప్పుకొచ్చింది. ఆమెను తాను భారతీయురాలిగా భావిస్తున్నట్లు పేర్కొంది. తనకు ప్రాణ హాని ఉందని.. తిరిగి పాకిస్తాన్ వెళ్లబోమని వెల్లడించింది. మరో కోణంలో చూస్తే భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించిన పాకిస్థాన్ మహిళ తీరు అనేక అనుమానాలకు తావిస్తోంది. ఆమె మామ పాకిస్థాన్ ఆర్మీలో సుబేదార్, సోదరుడు కూడా పాక్ ఆర్మీలో సైనికుడని సమాచారం తెలిసింది.
రబుపురా పోలీస్ స్టేషన్ లో ఆమె మీద విదేశీ చట్టం, పాస్ పోర్ట్ చట్టం, సెక్షన్ 120బీ, సెక్షన్ 34 కేసుల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. సీమా హైదర్ పాకిస్థాన్ గూఢచారి అయి ఉంటుందేమోనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆమెను పాకిస్థాన్ తిరిగి పంపకపోతే ఉగ్రదాడి జరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఉగ్రదాడి జరుగుతుందని హెచ్చరిస్తూ గుర్తు తెలియని వ్యక్తి నుండి ముంబై పోలీసులకు ఫోన్ వచ్చింది. అధికారులు భావిస్తున్న అనుమానమే నిజమే అని యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అలెర్ట్ అయ్యింది. ఆమెను 72 గంటల్లో తన దేశానికి వెళ్లిపోవాల్సిందిగా అధికారులు హెచ్చరిస్తున్నారు.
సీమా హైదర్ నుంచి విడిపోయిన భర్త గులాం హైదర్ సౌదీ అరేబియాలో పని చేస్తున్నాడు. ఈయన తన భార్య, పిల్లలతో తిరిగి కలవాలనుకుంటున్నానని.. భారత్, పాకిస్తాన్ అధికారులకు తన భార్యను సౌదీ పంపించమని రిక్వస్ట్ చేశాడు. అయితే సీమా మాత్రం సచిన్ తోనే, ఇండియాలోనే, హిందువుగా ఉంటానని చెబుతుంది. అయితే పాకిస్తాన్ లోని ఆమె తెగకు చెందిన వారు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆమెను తన వాళ్ళు చంపేస్తారేమో అని భయపడుతుంది. అందుకే ఇండియాలోనే ఉండిపోతానని అంటుంది. కానీ భారత అధికారులు మాత్రం ఆమెపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పాకిస్తాన్ నుంచి వచ్చిన గూఢచారి అయి ఉంటుందని అనుమానిస్తున్నారు. మరి ఈ పబ్జీ లవ్ స్టోరీలో ఆమె సరిహద్దు ప్రేమికురాలా? లేక పాకిస్తాన్ గూఢచారినా? మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి.