భారత నావికాదళం అమ్ములపొదిలోకి మరో సబ్‌మెరైన్ చేరింది. కల్వరీ క్లాస్ సబ్‌మెరైన్స్‌లో చివరిది, ఐదోది అయిన ‘ఐఎన్ఎస్ వాగీర్’ను నావికా దళ చీఫ్ అడ్మిరల్ ఆర్ హరికుమార్ లాంఛనంగా ఇండియన్ నేవీలో ప్రవేశపెట్టారు. ముంబైలోని నావల్ డాక్ యార్డ్ ఇందుకు వేదికైంది. అత్యాధునిక ఆయుధ వ్యవస్థ, వేగంతో దూసుకెళ్లే సామర్థ్యం, గుట్టుగా మోహరించే దమ్ము ఈ కొత్త సబ్‌మెరైన్ సొంతం. వాగీర్ రాకతో సముద్రజలాల్లో శత్రువులను ఎదుర్కోవడం, వారి నుంచి దేశ ప్రయోజనాలను సంరక్షించడం సులభతరం అవుతుందని హరికుమార్ అన్నారు. ఇంటెలిజెన్స్, నిఘా, మోహరింపు విభాగాల్లో నేవీ సామర్థ్యాన్ని వాగీర్ పరిపుష్టం చేస్తుందని చెప్పారు. ప్రాజెక్ట్ 75 కింద దీన్ని నిర్మించామని పేర్కొన్నారు.
కొత్త సబ్‌మెరైన్‌కు ‘వాగీర్’ అనే పేరు పెట్టడంలో ఓ కారణం ఉందని హరికుమార్ తెలిపారు. ఎలాంటి జంకు లేకుండా దాడి చేసే వాగీర్ అనే సొర చేప స్ఫూర్తిగా దీనికి ఆ పేరు పెట్టామన్నారు. ఇక భారత నేవీలో 24 నెలల వ్యవధిలో చేరిన మూడో సబ్‌మెరైన్ ఇది కావడం విశేషం. మజగావ్ డాక్ షిప్ బిల్డర్స్ కంపెనీ దీనిని రూపొందించింది. ఫ్రాన్స్ నుంచి బదిలీ చేసిన టెక్నాలజీని ఇందులో ఉపయోగించారు. నీటి లోపల గంటకు 40 కిలో మీటర్ల వేగంతో, నీటి మీద గంటకు 20 కిలో మీటర్ల స్పీడుతో నిఘా పెట్టడం వాగీర్ ప్రత్యేకత. సముద్రంలో 11 నెలల పాటు పలు ట్రయల్స్ సక్సెస్‌ఫుల్‌గా పూర్తయ్యాక ఈ సబ్‌మెరైన్‌ను నేవీలోకి తీసుకున్నారు.
VAGIR- the 5th #Scorpene submarine built by #MDL commissioned by #IN on 23 Jan 23. #CNS was the Chief Guest. Recent commissioning of Destroyer #INSMormugao & submarine #INSVagir ensure that MDL cements the sobriquet “Warship & Submarine builders to the Nation”. @makeinindia pic.twitter.com/VcNiYNo8ba
— Mazagon Dock Shipbuilders Limited (@MazagonDockLtd) January 23, 2023