భారత నావికాదళం అమ్ములపొదిలోకి మరో సబ్‌మెరైన్ చేరింది. కల్వరీ క్లాస్ సబ్‌మెరైన్స్‌లో చివరిది, ఐదోది అయిన ‘ఐఎన్ఎస్ వాగీర్’ను నావికా దళ చీఫ్ అడ్మిరల్ ఆర్ హరికుమార్ లాంఛనంగా ఇండియన్ నేవీలో ప్రవేశపెట్టారు. ముంబైలోని నావల్ డాక్ యార్డ్ ఇందుకు వేదికైంది. అత్యాధునిక ఆయుధ వ్యవస్థ, వేగంతో దూసుకెళ్లే సామర్థ్యం, గుట్టుగా మోహరించే దమ్ము ఈ కొత్త సబ్‌మెరైన్ సొంతం. వాగీర్ రాకతో సముద్రజలాల్లో శత్రువులను ఎదుర్కోవడం, వారి నుంచి దేశ ప్రయోజనాలను సంరక్షించడం సులభతరం అవుతుందని […]