భారతీయ రైల్వే ఎప్పటికప్పుడు ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడానికి సిద్ధంగా ఉంటుంది. ఈ నేపధ్యంలో ఇండియన్ రైల్వే ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికులు రైలు టికెట్లు బుకింగ్ చేసుకునేందుకు మరింత సులభతరమైన మార్గాన్ని ప్రవేశ పెట్టింది. ఇక నుంచి రైలు టికెట్లు పోస్టాఫీసుల్లో కూడా బుకింగ్ చేసుకునే సదుపాయం కల్పించింది.
మాములుగా రైల్వే స్టేషన్ లలో టికెట్స్ కోసం అందరూ క్యూ కట్టడం చూస్తుంటాము. పండగ రోజుల్లో ఈ రద్దీ మరీ ఎక్కువగా ఉంటుంది. ఇలా ప్రయాణికుల సమయం వృధా కాకూడదనే ఐఆర్‌సీటీసీ ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. పోస్టాఫీసుల నుంచి రైల్వే టికెట్స్ బుక్ చేసుకునే సదుపాయం ముందుగా ఉత్తరప్రదేశ్ లో ప్రారంభమైంది. ఇక్కడ సుమారు 9147 పోస్టాఫీసులలో టిక్కెట్ బుకింగ్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. రానున్న కాలంలో దేశం మొత్తం ఈ సదుపాయం అందుబాటులోకి రానుంది. మరి.. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.