ఎత్తైన శిఖరాలను అవలీలగా అధిరోహించే భారతీయ పర్వతారోహకుడు తప్పిపోయారు. ప్రపంచంలో అతిపెద్ద పర్వతాల్లో ఒకటైన పర్వతాన్ని అధిరోహించి తిరిగి వస్తుండగా మిస్ అయ్యారు. ఆచూకీ కోసం ఇంకా వెతుకుతూనే ఉన్నారు.
భారతీయ పర్వతారోహకుడు ప్రపంచంలోనే అతిపెద్ద శిఖరాల్లో ఒకటైన పర్వతాన్ని అధిరోహిస్తూ సోమవారం తప్పిపోయాడు. పర్వతారోహణ ముగించి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. నిన్నటి నుంచి అతని ఆచూకీ కోసం వెతుకుతున్నారు. రాజస్థాన్ లోని కిషన్ గడ్ కి చెందిన భారతీయ పర్వతారోహకుడు అనురాగ్ మలూ (34) నేపాల్ లోని ఖాట్మండులో అన్నపూర్ణ పర్వతం అధిరోహిస్తుండగా తప్పిపోయాడు. ప్రపంచంలోనే అతిపెద్ద శిఖరాల్లో అన్నపూర్ణ పర్వతం పదోది. సముద్ర మట్టం నుంచి 8091 మీటర్ల ఎత్తులో ఉంటుంది ఈ పర్వతం. అన్నపూర్ణ పర్వతంలోని క్యాంప్ 3 నుంచి దిగుతుండగా 6 వేల మీటర్ల ఎత్తు నుండి కింద పడిపోయాడని సెవెన్ సమ్మిట్ ట్రెక్స్ ఛైర్మన్ మింగ్మా షెర్పా వెల్లడించారు.
తప్పిపోయిన అనురాగ్ కోసం ఏరియల్ సెర్చ్ నిర్వహించి ట్రేస్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని షెర్పా తెలిపారు. సోమవారం ఉదయం నుంచి అనురాగ్ కనబడుట లేదు. ఇంకా అనురాగ్ ఆచూకీ తెలియలేదని షెర్పా అన్నారు. క్యాంప్ 4 ని చేరుకున్న తర్వాత అనురాగ్ పర్వతారోహణకు ఆపేసినట్టు షెర్పా వెల్లడించారు. 8 వేల మీటర్ల పైన ఉన్న 14 శిఖరాలను అధిరోహించే లక్ష్యంతో అనురాగ్ ఉన్నాడని, యూఎన్ గ్లోబల్ గోల్స్ సాధించే దిశగా అవగాహన కల్పించడం, కార్యాచరణ కోసం 7 శిఖరాలను అధిరోహించాడని షెర్పా తెలిపారు. అనురాగ్ సృష్టించిన రికార్డుల ఫలితంగా ఆర్ఈఎక్స్ కరంవీర్ చక్ర అనే అవార్డు వరించింది. అలానే భారత్ నుంచి 2041 అంటార్కిటిక్ యూత్ అంబాసిడర్ గా ఈయన ఉండడం విశేషం. త్వరగా అనురాగ్ మలూ ఆచూకీ తెలియాలని భగవంతుడ్ని ప్రార్థించండి.