కేంద్ర ప్రభుత్వం దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు పలు పథకాలను ప్రవేశపెట్టింది. వాటిని అర్హత కలిగిన వారికి అందిస్తుంది. గర్భిణీ మహిళల కోసం కేంద్ర ప్రభుత్వం రూ.5 వేలు వారి ఖాతాలో జమ చేస్తోంది.
కేంద్ర ప్రభుత్వం రైతులు, విద్యార్థులు, మహిళలకు పలు అభివృద్ధి పథకాలను అమలు చేస్తుంది. అర్హులైన వారికి నేరుగా వారి ఖాతాల్లోకి డబ్బులు పంపిస్తుంది. అందులో అటల్ పెన్షన్ యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన ఇలా చాలా స్కీం లు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. పీఎం కిసాన్ యోజన కింద సర్కార్ ప్రతి యేట అన్నదాతలకు రూ. 6000 వేలు ఆర్థిక సాయం అందిస్తోంది. అలాగే మహిళల కోసం కూడా కేంద్రం ప్రత్యేక పథకాలను అమలు చేస్తోంది. ప్రధానమంత్రి మాతృ వందన యోజన పథకం గర్భిణీ మహిళలకోసం ప్రవేశపెట్టింది. ఈ పథకాలను అమలు చేస్తుంది. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
కేంద్ర ప్రభుత్వం గర్భిణీ స్త్రీల కోసం ప్రధాన మంత్రి మాతృ వందన యోజన పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకాన్ని జనవరి 1, 2017న ప్రారంభించారు. ఇందులో భాగంగా గర్భిణీలకు రూ.5000 ప్రభుత్వం ఇస్తుంది. దేశ వ్యాప్తంగా గర్భిణీ స్త్రీలకు ఆర్థిక సాయంగా ఈ డబ్బులు అందిస్తారు. జన్మించిన పిల్లలకు పోషకాహార లోపానికి గురికాకుండా, ఎలాంటి వ్యాధులు సోకకుండా ఉండడానికి మహిళల ఖాతాలోకి డబ్బును జమ చేస్తారు. అయితే దీనికి కొన్ని అర్హతలు ఉండాలి.గర్భిణీ స్త్రీలకు కనీసం 19 ఏళ్లు నిండి ఉండాలి. గర్భిణి మహిళలు ఆఫ్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. వివరాల కోసం స్థానికంగా ఉన్న ఆశా వర్కర్ కలిసి దరఖాస్తు చేసుకోవాలి. స్థానిక ఆశా వర్కర్లు గర్భిణిల పేరును రిజిస్ట్రర్ చేసుకుని వారికి సంబంధించిన పథకాల వివరాలు తెలుపుతుంది. అర్హత ఉన్నవారిని ఆన్లైన్ లో దరఖాస్తు చేయిస్తుంది. పుట్టిన పిల్లలకు రక్షణ కోసం ఏఏ టీకాలు వేయాలనే విషయాలను అంగన్ వాడీ టీచర్ల ద్వారా తెలుసుకోవచ్చు.
ప్రభుత్వం మహిళలకు అందిస్తున్న రూ.5 వేలు మూడు దఫాలుగా వారి అకౌంట్లలో జమ చేస్తుంది. మొదటి సారి రూ.1000, రెండవ దఫాలో రూ.2000, మూడవ విడతలో రూ.2000 గర్భిణిల బ్యాంక్ ఖాతాలో జమ అవుతాయి. మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్ సైట్‌ను చెక్ చేసుకుని పూర్తి వివరాలను పొందవచ్చు. https://wcd.nic.in/schemes/pradhan-mantri-matru-vandana-yojana