ఓ వైపు ఆస్పత్రిలో తన భర్త ప్రాణాపాయ స్థాయిలో ఉంటే..ఆయన భార్య మాత్రం ఏకంగా వీర్యం కోసం తంటాలు పడిన ఘటన అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఇది ఇది వినటానికి కొంత మేరకు ఆశ్ఛర్యంగా ఉన్నా ముమ్మాటికీ నిజం..వివరాల్లోకి వెళ్తే…ఓ బాధితుడు కరోనా భారిన పడి ఆస్పత్రిలో చివరి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంటే . ఇక భార్యకు ఏం చేయాలో అర్ధం కాలేదు. తన భర్త చనిపోతాడేమో భావించి ఒకడుగు ముందుకేసింది. అదే ఎలా అనుకుంటున్నారా?
ఎలాగైనా తన భర్త వీర్యం తోనే పిల్లలను కనాలని భావించి గుజరాత్ హై కోర్టు కోట్లు మెట్లు ఎక్కింది. నా భర్త చనిపోయే పరిస్థితిలో ఉన్నాడని, ఐవీఎఫ్ ద్వారా గర్భం దాల్చాలనుందని ఎలాగైనా నా భర్త వీర్యాన్ని సేకరించేలా వైద్యులకు ఆదేశాలివ్వాలని న్యాయ స్థానాన్ని కోరింది. ఈమె వాదనలు విన్న న్యాయస్థానం వెంటనే స్పందించి కొన్ని కీలక ఆదేశాలు జారీ చేసింది. వడోదరాలో ఉన్న బాధితుడి ఆస్పత్రికి ఆదేశాలు పంపి ఇక తక్షణమే ఆస్పత్రిలో ఉన్న ఆమె భర్త వీర్యాన్ని సేకరించాలని సూచించింది న్యాయస్థానం.
దీంతో డాక్టర్లు ఆ వ్యక్తి నుంచి వీర్యాన్ని సేకరించారు. కానీ వీర్యం సేకరించిన కొన్ని గంటల తరువాత ఆ వ్యక్తి మరణించాడు. తన భర్త నుంచి వీర్యం సేకరించటంలో సక్సెస్ అయినా చివరికి తన భర్త ప్రాణాలను దక్కించుకోలేకపోయింది. సంతానం లేకపోవటంతో తన భర్త విర్యంతోనే ఎలాగైనా వంశాన్ని నిలబెట్టేందుకు ఆ మహిళా ప్రయత్నం చేసింది. ఈ వార్త దేశ వ్యాప్తంగా అందరిని భావోద్వేగానికి గురిచేస్తోంది. స్పెర్మ్ సేకరించి తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు వీర్యాన్ని జాగ్రత్తగా ఉంచాలని తెలిపింది హై కోర్టు. గుజరాత్ లో జరిగిన ఈ ఘటన అందరిని కలిచివేస్తోంది.