సహజీవనం అగ్రిమెంట్ ప్రకారం తన ప్రియురాలిని తన భర్త విడిపించి తనకు అప్పజెప్పాలని ఓ ప్రియుడు కోర్టును ఆశ్రయించాడు. ఆమెను భర్త, అతడి కుటుంబ సభ్యులు అక్రమంగా నిర్భంధించారని,. వాళ్ల చెర నుండి విడింపించాలని కోరాడు. ఈ కేసును విచారించిన కోర్టు ఏం తీర్పు ఇచ్చిందంటే..?
భార్యా భర్తల సంబంధాల్లోకి మూడో వ్యక్తి ప్రవేశించడంతో అనేక కాపురాలు కూలిపోతున్నాయి. వివాహేతర సంబంధాలు, అక్రమ సంబంధాలు, సహజీవనం వంటివి అందుకు కారణమౌతున్నాయి. దంపతులు మధ్య మొదలైన చిన్న చిన్న గొడవలను క్యాష్ చేసుకుంటున్న కొందరు.. వారి మధ్యకు వచ్చి పచ్చని సంసారంలో చిచ్చు పెడుతున్నారు. భర్త, భార్యల్లో ఒకరు తప్పుదోవ పడుతున్నారు. జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. అదేమంటే కోర్టు కూడా చెబుతుందీగా ఇద్దరి అంగీకారం ఉంటే అటువంటి సహజీవనాన్ని అంగీకరిస్తుందని తమ తప్సును సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ఈ కోవకు
చెందిన ఓ కేసు కోర్టుకు చేరింది. ఆ కేసులో కోర్టు తీర్పు ఏం ఇచ్చిందంటే..
సహజీవనం అగ్రిమెంట్ ప్రకారం తన ప్రియురాలిని ఆమె భర్త నుంచి విడిపించి తనకు అప్పగించాలని కోరుతూ ఓ లవర్ ఏకంగా హైకోర్టు మెట్లెక్కాడు. ఈ ఘటన గుజరాత్‌లో చోటుచేసుకుంది. ఈ పిటిషన్ ను విచారించిన జస్టిస్ వి ఎం పంచోలీ, జస్టిస్ ప్రచాక్‌లతో కూడిన ధర్మాసనం పిటిషనర్‌కి దిమ్మతిరిగే సమాచానం ఇచ్చింది. వివరాల్లోకి వెళితే.. లివ్ ఇన్ అగ్రిమెంట్ ప్రకారం తన ప్రియురాలిని ఆమె భర్త నుంచి విడిపించాలని వస్కాంత జిల్లాకు చెందిన ఓ వ్యక్తి మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించాడు. తాము ఇద్దరం సహజీవనంలో ఉన్నామని, ఆమె ఇష్టానికి విరుద్ధంగా మరొకరితో వివాహం జరిగిందని పేర్కొన్నాడు. వారిద్దరూ కలిసి జీవించలేకపోయారని, భర్తను వదిలేసి ఆమె తన వద్దకు వచ్చేసిందని, అనంతరం మేమిద్దరం లివ్-ఇన్ రిలేషన్ షిప్ అగ్రిమెంట్‌పై సంతకం చేశామని పేర్కొన్నాడు. కొన్ని రోజుల తర్వాత మహిళ కుటుంబ సభ్యులు ఆమెను బలవంతంగా భర్త వద్దకు తీసుకెళ్లారని పిటిషన్ లో పేర్కొన్నాడు
ప్రియురాలి కోసం కోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసిన లవర్.. తనను ఆమె భర్త, కుటుంబ సభ్యులు అక్రమంగా బంధించారని, ఆమెను వాళ్ల చెర నుండి విడిపించి తనకు అప్పగించేలా పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరాడు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ పిటిషన్‌ను తిరస్కరించింది. ఇలాంటి పిటిషన్ దాఖలు చేయడానికి అతనికి ఎలాంటి హక్కు లేదని తేల్చి చెప్పింది. భర్త దగ్గర భార్య ఉండటం అక్రమ కస్టడీకి కిందకు రాదని తెలిపింది. ఈ కేసును విచారించిన ధర్మాసనం పిటిషనర్‌తో ఆ మహిళలకు వివాహం జరగలేదని, అలాగే ఆమె తన భర్త నుంచి కూడా విడాకులు తీసుకోలేదని పేర్కొంది. కాబట్టి పిటిషనర్ ఆరోపించినట్లుగా ఆ మహిళ తన భర్తతో అక్రమ కస్డడీలో ఉందని చెప్పలేమని తేల్చి చెప్పింది. ఈ పిటిషన్‌ను దాఖలు చేయడానికి పిటిషన్‌రకు ఎలాంటి హక్కులేదని, ఇందుకు గాను పిటిషనర్‌పై రూ. 5 వేల జరిమాన విధించింది కోర్టు. జరిమానాను స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీలో డిపాజిట్ చేయాలని ఆదేశించింది.