హిజ్రాలు..చప్పట్లు కొడుతూ, రోడ్లపై, బస్సుల్లో, రైళ్లలో తిరుగుతూ డబ్బులు అడుక్కోవటమే జీవనాధారంగా బతుకుతున్నారు. అలా ఉంటే సరిపోతుంది. కానీ కొంతమంది హిజ్రాలు మాత్రం జనాలను కాస్త ఇబ్బంది పెడుతూ డబ్బులు డిమాండ్ చేస్తూ విసిగిస్తారు. ఇదిలా ఉంటే ఓ చోట మాత్రం ఏకంగా డబ్బులు ఇవ్వనందుకు జనాల మీదకు దాడికి సైతం దిగారు. వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్రలోని నాశిక్ ప్రాంతం. అక్కడ షిండే టోల్ ప్లాజా వద్దకు గ్యాంగ్‌గా వచ్చారు హిజ్రాలు. జనాల నుంచి డబ్బులు అడగటం కాకుండా ఇవ్వనందుకు జనాలపై దాడికి దిగిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
కొందరు హిజ్రాలు నాశిక్ ప్రాంతంలో ఏకమై రోడ్డుపై వెళ్తు ఉన్న ప్రయాణికులను డబ్బులు అడగటం మొదలు పెట్టారు. కొందరు ఇవ్వకుండా అలాగే వెళ్లారు. దీంతో హిజ్రాలు ఇవ్వనివాళ్లను నోటికొచ్చినట్లు తిట్టడం మొదలు పెట్టారు. కోపోద్రిక్తులైన కొందరు ప్రయాణికులు వాళ్లపై మాటల దాడికి దిగారు. దీంతో ఎంతకు కూడా హిజ్రాలు వెనక్కి తగ్గకపోవటంతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ దాడిలో ఇద్దరి ప్రయాణికులకు గాయాలయ్యాయి. దీంతో పక్కనున్న ప్రయాణికులు కొందరు మొబైల్‌లో కెమెరాతో ఈ దాడి ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు.
సమాజంలో తోటి మనుషులతో స్నేహపూర్వకంగా మెలగాల్సింది పోయి ఇష్టమొచ్చిన రీతిలో దాడికి దిగటం ఏంటని కొందరు ప్రశ్నిస్తున్నారు. హిజ్రాల కొరకు ప్రభుత్వాలు గుర్తింపు తెవాలని ప్రయత్నిస్తుంటే వీరు చేస్తున్న తీరును చూస్తే మాత్రం భయంకరంగా ఉందని అంటున్నారు. ఇక రోడ్లలపై తిరిగే సామన్యులు హిజ్రాలకు భయపడి తిరిగే రోజులు రావచ్చని ఈ వీడియోను చూస్తే అర్ధమవుతోంది. ఇక హిజ్రాల తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో మాకు తెలియజేయండి.