దేశంలో కరోనా కష్టాలు తిరినా.. నిత్యాసర సరుకుల ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి.. వాటికి తగ్గట్టు పెట్రోల్, డీజిల్ తో పాటు నిత్యం వినియోగించే గ్యాస్ ధరలు కూడా చుక్కలనుంటుకుంటున్నాయి. ఇది సామాన్య ప్రజలకు పెను భారంగా మారిపోయింది.
ప్రస్తుతం దేశంలో నిత్యవసర సరుకుల ధరలు చుక్కలను తాకుతున్నాయి. ఇక పెట్రోల్, డీజల్ ధరలతో పాటు వంట గ్యాస్ ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. ఇక వాణిజ్య సిలిండర్ ధరల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఇది సామాన్య ప్రజలకు పెను భారంగా మారిపోయింది. కొంత కాలంగ క్రితం రూ.600 వరకు ఉన్న సిలిండర్ ధర ఇప్పుడు రూ.1100 వందలకు చేరింది. ఇలాంటి పరిస్థితి లో ప్రభుత్వం గ్యాస్ వినియోగదారులకు శుభవార్త తెలిపింది. ఒక్కో సిలిండర్ పై రూ. 300 సబ్సిడీ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఇటీవల దేశ వ్యాప్తంగా గ్యాస్ సిలిండర్ ధరలు అమాంతం పెరిగిపోయి సామాన్యులకు పెను భారంగా మారిపోయాయి. పేద ప్రజలను దృష్టిలో పెట్టుకొని పుదుచ్చేరి ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఎల్ పీజీ గ్యాస్ సిలిండర్ ఉన్న వారికి శుభవార్త చెప్పింది. రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ గ్యాస్ సిలిండర్ పై రూ.300 చొప్పున సబ్సిడీ ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామి ప్రకటించారు. 2023-04 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో ఆయన ఈ కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి నెలకు ఒక సిలిండర్ రై రూ.300 సబ్సిడీ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ పథకానికి బడ్జెట్ లో రూ.126 కోట్లు కేటాయించినట్లు సీఎం రంగస్వామి తెలిపారు.
కరోనా ప్రభావం తర్వాత సామాన్యులకు నిత్యావసర సరుకుల ధరలు అమాంతం పెరిగిపోయిన విషయం తెలిసిందే.. సందిట్లో సడేమియాలా గృహ వినియోగానికి ఉపయోగించే వంట గ్యాస్, వాణిజ్య గ్యాస్ ధరలు ఒక్కసారిగా పెరిగిపోవడంతో సామాన్యులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇలాంటి సమయంలో పుదుచ్చేరిలో గ్యాస్ ధరపై రూ.300 సబ్సిడీ ప్రకటించడంతో రేషన్ కార్డుదారులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.