ప్రపంచంలో ఇప్పుడు మహిళలు పురుషులతో అన్ని రంగాల్లో పోటీ పడుతున్నారు. ఓ వైపు కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తూనే భిన్నమైన రంగాల్లో తనదైన సత్తా చాటుతుంది. క్రీడా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో తనదైన ముద్ర వేస్తుంది.
ప్రస్తుతం కాలంలో మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా పోటీ పడుతున్నారు. సమాజాభివృద్దిలో మహిళలది ఎంతో కీలక పాత్ర ఉంటుంది. కుటుంబాన్ని చూసుకుంటూనే వ్యాపారం, ఉద్యోగం ఇలా భిన్నమైన రంగాల్లో తనదైన పాత్ర పోషిస్తుంది మహిళ. సమాజంలో ఎన్ని ఒత్తిళ్ళు ఉన్నా వాటన్నింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ తన విధులను నిర్వహిస్తుంది. రేపు బుధవారం మార్చి 8 ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవం’. ఈ సందర్బంగా భారత వైమానిక దళం ఓ చారిత్రాత్మక నిర్ణయాన్ని ప్రకటించింది. యుద్ధభూమిలో నిర్వహించే విధులకు తొలిసారిగా మహిళను నియమించింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా భారత వైమానిక దళం గొప్ప నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఇండియన్ వైమానిక దళం లోని పశ్చిమ విభాగంలో గ్రూప్ కెప్టెన్ గా విధులు నిర్వహిస్తున్న షాలిజ ధామిని పాకిస్థాన్ సరిహద్దులో మిస్సైల్ స్క్వాడ్రన్‌కు కమాండింగ్ ఆఫీసర్‌గా నియమించింది. భారత వైమానిక దళంలో గ్రూప్ కెప్టెన్ గా ఉంటున్న షాలిజ ధామి ఇలా కీలకమైన కంబాట్ యూనిట్ బాధ్యతలు నిర్వహించనున్న తొలి మహిళగా రికార్డ్ క్రియేట్ చేసింది. మహిళలకు యుద్ద రంగంలో పురుషులతో సమానంగా అత్యున్నతమైన బాధ్యతలను అప్పగించాలని.. మహిళా దినోత్సవం సందర్భంగా ఐఏఎఫ్ ఈ సంచలన నిర్ణయం తీసుకుంది.
ఇక షాలిజా ధామిని కెరీర్ విషయానికి వస్తే.. 2003 లో హెలికాప్టర్ పైలట్ గా వాయుసేనలోకి ఆమె అడుగు పెట్టారు. ఆ తర్వాత తన పనితనంలో ఎంతోమంది ప్రశంసలు అందుకున్నారు.. అంతేకాదు క్వాలిఫైడ్ ఫ్లయింగ్ ఇన్‌స్ట్రక్టర్ గా మంచి పేరు తెచ్చుకున్నారు ధామిని. 2900 గంటలకు పైగా విమానాన్ని నడిపిన గొప్ప అనుభవం ఉన్న అత్యంత క్వాలిఫైడ్ హెలికాప్టర్ పైలెట్ గా పేరు తెచ్చుకున్న ధానిమి ఇప్పుడు భారతదేశం కీలక ప్రాంతం సరిహద్దు సెక్టార్ లలో కమాండ కంట్రోల్ ని పర్యవేక్షించనున్నారు. ఈ సందర్బంగా రిటైర్డ్ డైరెక్టర్ జనరల్ అనీల్ చోప్రా మాట్లాడుతూ.. ఇదో గొప్ప కీలక పరిణామం.. యుద్ద భూమిలో మహిళా అధికారులను నియమించడం అనేది ఓ మైలురాయి… మహిళా ఆఫీసర్ నాయకత్వంలో సాయుధ బలగాలను ముందుకు నడిపించడం గొప్ప విషయం అని అన్నారు.
Group Captain Shaliza Dhami has been selected by the Indian Air Force to take over a frontline combat unit’s command in the western sector.
Read more here: #IAF #ShalizaDhami #FutureFemaleForward #WomensDayhttps://t.co/dkX2SyxuIr
— CNBC-TV18 (@CNBCTV18News) March 7, 2023