భారతీయ రైల్వే ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. అకస్మాత్తుగా ట్రాక్ పైకి వచ్చేసిన గేదెల్ని ఢీకొట్టింది. దీంతో రైలు ముందుభాగం దెబ్బతింది. ఈ ప్రమాదంలో నాలుగు గేదెలు కూడా చనిపోయాయి. అయితే.. ఈ ఘటనలో రైల్వే పోలీసులు చూపిస్తున్న అత్యుత్సాహం చర్చనీయాంశమవుతోంది. చనిపోయిన గేదెలకు నష్టపరిహారం చెల్లించాలంటూ ఒకవైపు విమర్శలొస్తుంటే, వాటిని పట్టించుకోకుండా సదరు గేదల యజమానులపై కేసు నమోదు చేసింది.
వారం రోజుల క్రితం ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఈ వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలును ప్రారంభించారు. ఇది ముంబై-గాంధీనగర్ నగరాల మధ్య ప్రయాణిస్తుంది. ఇలా ప్రయాణిస్తుండగా నిన్న గుజరాత్‌లోని వాత్వా స్టేషన్ దగ్గర ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఇంజన్ ముందు భాగం పాక్షికంగా ధ్వంసమైంది. ఈ ప్రమాదంలో నాలుగు గేదెలు కూడా మృత్యువాతపడ్డాయి. ఈ ఘటన జరిగిన 24 గంటల తర్వాత, గుజరాత్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) పోలీసులు సదరు గేదల యజమానులపై కేసు నమోదు చేశారు. రైల్వే చట్టం 1989లోని సెక్షన్ 147 ప్రకారం ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు ఆర్‌పిఎఫ్ ఇన్‌స్పెక్టర్ ప్రదీప్ శర్మ తెలిపారు. అయితే.. ఇప్పటివరకు ఆ గేదెల యజమానులను గుర్తించకపోవడం గమనార్హం. వారి కోసం గాలింపు కొనసాగుతున్నట్లు వార్తలొస్తున్నాయి.
Vande Bharat Express running b/w Mumbai Central to Gurajat’s Gandhinagar met with an accident after a herd of buffaloes came on the railway line at around 11.15am b/w Vatva station to Maninagar. The accident damaged the front part of the engine: Western Railway Sr PRO, JK Jayant pic.twitter.com/OLOMgEv10G
— ANI (@ANI) October 6, 2022
మరోవైపు చనిపోయిన గేదెలకు నష్టపరిహారం చెల్లించాకుండా యజమానులపై కేసులు నమోదు చేయడమేంటంటూ.. పోలీసులు తీరుపై ప్రజలు మండిపడుతున్నారు. రైల్వే పోలీసులు బర్రెలదే (అంటే.. ఇక్కడ బర్రెల యజమానులదే) తప్పు అన్నట్లుగా ప్రవర్తించడంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. మూగజీవాలు అన్నాక ఎటు వెళ్లకుండా ఉంటాయా! అని పోలీసుల తీరును అందరూ నిలదీస్తున్నారు. ఒకవేళ.. పిల్లులు, కుక్కలతో ఇలాంటి ప్రమాదాలు జరిగితే వాటిపైనే ఇలానే కేసులు నమోదు చేస్తారా? అంటూ విమర్శకులు ప్రశ్నిస్తున్నారు.
नकली खोखले विकास वाले “Gujarat Model” का एक और नमूना।
The Vande Bharat train, which was inaugurated by the Prime Minister in Gujarat on 30th September, which shows a new dimension of development, met with an accident due to the problem of stray animals in the state. pic.twitter.com/mAEehNIsYF
— MD Kareem (@MDKareemWadi) October 6, 2022