గత కొంత కాలంగా దేశంలో ప్రతిరోజూ ఎక్కడో అక్కడ పదుల సంఖ్యల్లో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. డ్రైవర్ల నిర్లక్ష్యం, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు అంటున్నారు. ఇక పెద్ద పెద్ద నగరాల్లో ట్రాఫిక్ నియమాలు కఠినంగా మార్చారు. నియమాలు ఏమాత్రం ఉల్లంఘించినా చలాన్లు విధిస్తున్నారు. కానీ కొంత మంది చలానా తప్పించుకోవడానికి రక రకాల జిమ్మిక్కులు చేస్తుంటారు.. మరికొంత మంది అధికారులపై తిరగబడుతుంటారు. ఓ వ్యక్తి కారు డ్రైవింగ్ చేస్తూ సెల్ ఫోన్ లో మాట్లాడటమే కాకుండా ప్రశ్నించినందుకు ట్రాఫిక్ పోలీస్ పట్ల దారుణంగా ప్రవర్తించాడు. చలాన్ కట్టమన్నందుకు కారు బానట్ పై ట్రాఫిక్ పోలీస్ ఏకంగా 4 కిలో మీటర్ల దూరం లాక్కెల్లాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లో జరిగింది. వివరాల్లోకి వెళితే..
మధ్యప్రదేశ్ లోని ఇండొర్ లో సత్య సాయి జంక్షన్ వద్ద కేశవ్ ఉపాధ్యాయ్ అనే వ్యక్తి కారు నడుపుకుంటూ వెళ్తున్నాడు. ఆ సమయంలో అక్కడ శివ సింగ్ చౌహాన్ అనే ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ విధులు నిర్వహిస్తున్నాడు. కేశవ్ ఉపాధ్యాయ్ కారునడుపుకుంటూ సెల్ ఫోన్ లో మాట్లాడటం గమనించాడు ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ చౌహాన్. అలా ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేయడం తప్పని చలాన్ కట్టాలని అన్నాడు.. దాంతో ఆగ్రహించిన కేశవ్ ట్రాఫిక్ కానిస్టేబుల్ తో వాగ్వాదానికి దిగాడు. అంతేకాదు అక్కడ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయగా ట్రాఫిక్ పోలీస్ అతని కారు బానట్ పై ఎక్కాడు.. అయినా కూడా కేశవ్ ఉపాధ్యాయ్ ఏమాత్రం లెక్కచేయకుండా కానిస్టేబుల్ ని అలాగే 4 కిలోమీటర్లు కారుని నడిపాడు.
ఆ కారును వెంబడించిన పోలీసులు ఆపి కేశవ్ ఉపాధ్యాయ్ ని అదుపులోకి అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో ట్రాఫిక్ కానిస్టేబుల్ చౌహాన్ కి గాయాలు అయినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. కారు డ్రైవర్ పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. అనుమానం వచ్చి కేశవ్ ఉపాధ్యాయ్ కారు చెక్ చేయగా రెండు తుపాకులు, బుల్లెట్లు లభించినట్లుగా అధికారులు వెల్లడించారు. గతంలో కూడా అచ్చం ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. తాజాగా ట్రాఫిక్ కానిస్టేబుల్ కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ग्वालियर के केशव उपाध्याय ने इंदौर में गाड़ी चलाने के दौरान फोन पर बात करते हुए ट्रैफिक तोड़ा और रोकने पर ट्रैफिक कांस्टेबल शिव सिंह चौहान को चार किलोमीटर तक अपने बोनट पर टांग कर ले गए।
बताया जा रहा है के FIR कर छोड़ दिया गया।pic.twitter.com/PXEhQ3lm31
— काश/if Kakvi (@KashifKakvi) December 12, 2022