మన జీవితాల్లో బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం అనేది ఓ సంప్రదాయం. ముఖ్యంగా పుట్టిన రోజు, పెళ్లి వేడుకల్లో బహుమతులు ఇస్తుంటారు. విలువైన వస్తువులను బహుమతులుగా పుట్టిన రోజు, ఇతర శుభకార్యాలు జరుపుకునే వారికి ఇస్తుంటారు. కానీ కొన్ని బహుమతులు ఆశ్చర్యాన్ని, హాస్యాన్ని కలిగించేలా ఉంటాయి.
మానవ జీవితంలో బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం అనేది సర్వసాధారణం. ముఖ్యంగా పుట్టిన రోజు, పెళ్లి వేడుకల్లో బహుమతులు ఇస్తుంటారు. విలువైన వస్తువులను బహుమతులుగా పుట్టిన రోజు, ఇతర శుభకార్యాలు జరుపుకునే వారికి ఇస్తుంటారు. అయితే కొందరు ఇచ్చే బహుమతులు చాలా ఆశ్చర్యానికి కలిగించేలా ఉంటాయి. బాక్సుల్లో కుక్క పిల్లలను పెట్టి ఇవ్వడం. జంతువులను బహుమతిగా ఇవ్వడం వంటివి చేస్తుంటారు. అలాంటి వింత బహుమతులు అందుకున్నవారు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తుంటారు. ఇలాంటి వింత అనుభవం సాక్షాత్తు తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రికి ఎదురైంది. తమిళనాడు సీఎం స్టాలిన్ కు ఓ అభిమాని ఒంటెను బహుమతిగా ఇచ్చాడు. అసలు వివరాల్లోకి వెళ్తే..
బుధవారం తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పుట్టిన రోజు వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి. ఆయన 70వ పుట్టిన రోజు వేడుకలను డీఎంకే పార్టీ కార్యకర్తలు అంగరంగవైభవంగా నిర్వహించారు. అలానే సీఎం స్టాలిన్ పుట్టిన రోజు వేడుకలో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈక్రమంలో రాష్ట్రం నలుమూల నుంచి డీఎంకే పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. అందరూ సీఎం స్టాలిన్ కు పుష్ప గుచ్చాలు ఇస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఎంకే స్టాలిన్ పుట్టినరోజు కానుకగా తిరువణ్ణామలై జిల్లాకు చెందిన డీఎంకే కార్యకర్తలు బుధవారం పార్టీ ప్రధాన కార్యాలయంలో ఒంటెను సమర్పించారు. ఈ బహుమతి సీఎంకు ఓవైపు హస్యాన్ని ,మరోవైపు సంతోషాన్ని కలిగించింది. తిరువణ్ణాలైకి చెందిన జకీర్ షా అనే వ్యక్తి రెండేళ్ల వయస్సున ఒంటెను సీఎం స్టాలిన్ కు బహుమతిగా ఇచ్చారు. ఒంటెను సమావేశ మందిరంలోకి తీసుకెళ్లే సమయంలో డీఎంకే పార్టీ జెండతో అలంకరించారు. అయినప్పటికీ, భద్రతా సిబ్బంది అతన్ని త్వరగా వేదికపైకి తీసుకెళ్లారు.
ఇక నుంచి ప్రతి ఏటా స్టాలిన్ పుట్టిన రోజు.. జీవించి ఉన్న మూగజీవాన్ని బహుమతిగా ఇస్తానని జకీర్ షా తెలిపాడు. ఇక తన పుట్టిన రోజు వేడుకల్లో స్టాలిన్ స్వయంగా ఒక మొక్కను నాాటారు. అంతేకాక తనకు ఎదురైన పార్టీ సభ్యుల, ఎమ్మెల్యేలు, ఇతర వ్యక్తులకు బహుమతులుగా మొక్కలను కూడా పంపిణీ చేశారు. సీఎంకు ఒంటెను సమర్పిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స రూపంలో తెలియజేయండి.
Not able to get over this. DMK party workers gifted CM MK Stalin a camel on his birthday 😶😶 pic.twitter.com/E3gcZLk0p2
— Shilpa (@Shilpa1308) March 1, 2023