దేశంలో ఇప్పటికీ కొన్ని చోట్ల అంటరాని తనం, జాతి, కుల వివక్షత కొనసాగుతూనే ఉన్నాయి. అగ్ర వర్ణాల అహంకారం అణగారిన వర్గాలపై ఇంకా కొనసాగుతూనే ఉంది. అందరినీ చల్లగా చూసే దైవ సన్నిధిలో అన్నదానం చేస్తున్న సమయంలో ఆకలి అని వెళ్లిన ఓ మహిళను దారుణంగా అవమానించారు.. హేళనగా మాట్లాడారు.. ఆ గుడి పెద్దల మూర్ఖత్వం కాకపోతే.. పది మంది ఆకలి తీర్చేందుకే అన్నదాన కార్యక్రమం చేస్తుంటారు.. అలాంటింది ఇక్కడ కూడా దారుణమైన కుల వివక్షత చూపించడంతో ఆమె గుడి పెద్దలను నిలదీసింది.. గొడవ పడింది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి… అక్కడితో ఈ విషయం ఆగిపోలేదు.. ఎమ్మెల్యే, మంత్రులు, హిందూ సంస్థల వరకు వెళ్లడమే కాదు.. ఏకంగా సీఎం దాకా చేరింది.
ఈ విషయంపై ప్రత్యేకంగా స్పందించిన తమిళనాడు సీఎం స్టాలిన్ తనదైన మార్క్ చూపించాడు.. అందరిచే షహబాష్ అనిపించుకున్నారు. నిజంగా పాలకుడు జనంలో ఉండాలి.. జనంతో ఉండాలి.. జనకం కోసం బతకాలి అన్నదానికి సరైన అర్థం చెప్పారు సీఎం స్టాలిన్. పరిపాలన అంటే పార్ట్ టైమ్ జాబ్ కాదు.. ఐదేళ్ల కాంట్రాక్ట్ కాదు.. తమపై ఎంతో నమ్మకంతో ప్రజలు ఎన్నుకున్నారు.. వారి సమస్యలపై సంపూర్ణ దృష్టి సారించాలి.. పరిష్కరించాలన్న గొప్ప మనసు చాటుకున్నవారే అసలైన నాయకులు అవుతారని నిరూపించుకున్నారు సీఎం స్టాలిన్.
ఊళ్లు తిరుగుతూ పూసల దండలు గట్రా అమ్ముకుని బతికే నరిక్కువర కులాని అశ్వని (21) అనే మహిళ నరిక్కువర కులానికి చెందినది. తమిళనాడులోని మామళ్లాపురం గ్రామంలో ఉంటుంది. అక్కడ స్థల శయన పెరుమాల్ గుడి ఉంటుంది. రాష్ట్రమంతా దాదాపు 750 గుళ్లలో ఉచిత అన్నదానం చేస్తున్నట్టే అక్కడ కూడా చేస్తారు. అన్నదానం కార్యక్రమంలో ఘోరమైన అవమానం జరిగింది.. ఆమెకు అన్నదానం ఇవ్వకుండా నిరాకరించారు. కారణమేంటంటే ఆమె కులం తక్కువ అని.. ఊరు ఊరు తిరిగి పూసల దండలు అమ్ముకుని బతికే నరక్కువర కులం ఎస్సీ, ఎస్టీల కిందకు రాదు. అట్లా అని బీసీ కూడా కాదు. ఎంబీసీ అంటే.. మోస్ట్ బ్యాక్ వర్డ్ క్లాస్ అన్నమాట. తనకు జరిగిన అవమానానికి అశ్విని వెను తిరగలేదు.. ఈ కాలంలో కూడా ఇంతటి వివక్ష ఎందుకు అని గుడిపెద్దలతో గొడవకు దిగింది.
ఆ దృశ్యాలను కొంతమంది ఫొటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అది కాస్త వైరల్ గా మారి తమిళనాడులో సంచలనం రేపింది. ఈ విషయం ఎమ్మెల్యే, మంత్రుల స్థాయి దాటి ముఖ్యమంత్రి స్టాలిన్ దాకా వెళ్లింది. అయితే విషయం తెలుసుకున్న సీఎం స్టాలిన్ తన గొప్ప తనం.. మంచి మనసు చాటుకున్నాడు.. తన రాజకీయ పరణితిని చాటుకున్నారు. ఎలాంటి హంగూ.. ఆర్భాటాలు లేకుండా సాదాసీదా మనిషిగా అశ్విని ఇంటికి వెళ్లారు. ఆమె ఇంట్లో కూర్చొని ముచ్చటించారు.. అక్కడే మరికొంత మంది ప్లస్ ఇరులార్ కుటుంబాల వివరాలు కూడా తెలుసుకున్నారు. అప్పటికప్పుడే వారికి కొన్ని డెవలప్ మెంట్ పనులకు పథకాలను ప్రకటించాడు. వారితో కలిసి వారి బాధలు విన్నారు.. వారు ఇచ్చిన ధరఖాస్తులను ఎంతో ఓపికగా స్వయంగా స్వీకరించారు.. పరిష్కరిస్తానని హామీ కూడా ఇచ్చారు. ఎంతోకాలంగా పెండింగ్ లో ఉన్న రేషన్ కార్డులు, ఇళ్ల పట్టాలు, ముద్రా రుణాలు, ఓల్డేజ్ పెన్షన్లు, ఓటర్ ఐడీ కార్డులు, ఎంబీసీ సర్టిఫికెట్లు ఇప్పించాడు.
తమిళనాడు సీఎం తన ఇంటికి రావడంతో అశ్వని సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. తన ఇంటికి వచ్చిన రారాజుకి తనకు కలిగినంత ఇచ్చుకుంది.. తాను అమ్ముకునే పూసల దండల్లో మంచి దండ తీసి ఇచ్చింది.. ఓ శాలువా కప్పి దండం పెట్టింది. స్టాలిన్ సందర్శించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి, దీపావళిని ప్రజలతో గడపాలని ఆయన తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలు ప్రశంసించారు. అయితే ఈ మద్య సూర్య హీరోగా నటించిన ‘జై భీమ్’ సినిమాలో ఇరులార్ జాతి గురించి కళ్లకు కట్టినట్టు చూపించారు. అలాంటిదే నరిక్కువర.. ఇలా మన తెలుగు రాష్ట్రాల్లో కూడా వివక్షకు గురయ్యే కొన్ని కులాల వారు ఇప్పటికీ కన్నీరు కారుస్తూనే ఉన్నారు. ఫామ్ హౌజ్ లోనో, నాలుగు గోడల మధ్యనో కూర్చుని జనాలను కలవకుండా పరిపాలించడం కాదు అని చాలా మంది కామెంట్ చేస్తున్నారు. హ్యాట్సాఫ్ సీఎం స్టాలిన్ సార్ అంటున్నారు నెటిజన్లు.