కొద్ది రోజుల క్రితం ఒడిశా బాలాసోర్ జిల్లాలో జరిగిన ట్రైన్ యాక్సిడెంట్ ఎంతటి విషాదాన్ని నింపిందో మనందరికి తెలిసిందే. ఈ ప్రమాదంలో మరిణించిన వారి కుటుంబాలు ఇంకా విషాదం నుంచి కోలుకోలేకపోతున్నారు.. అందులో కొంతమంది గాయపడిన వారు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
ఒడిశాలో కోరమండల్ ఎక్స్ ప్రెస్ ఆగి ఉన్న గూడ్స్ రైలును ఢీ కొట్టిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఇప్పటికీ 288పైగా మరణించారు. 1000 మందికి పైగా గాయపడ్డారు. అలా ఆ ఘటన నుంచి కోలుకోకముందే ఇంకొక రైలు ప్రమాదం నుంచి తప్పించుకుంది. పట్టాలపై పడిన బండరాయి వలన లోకో పైలట్ గమనించి.. అతడు చాకచక్యంగా వ్యవహరించి రైలును ఆపేసాడు. దీంతో పెను ప్రమాదం తప్పింది. తాజాగా ఈ ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే..
కర్ణాటకలోని బీదర్ నుంచి కలబురగి వెళ్తున్న 07746 నంబర్ ట్రైన్ సోమవారం ఉదయం 7:30 గంటలకు బీదర్ రైల్వేస్టేషన్ నుండి DEMU ప్యాసింజర్ రైలు వెళ్తుండగా… కలబురిగి జిల్లా కమలాపుర ప్రాంతంలోని మారగుట్టి సమీపంలో ఉదయం 9 గంటల ప్రాంతంలో రైలు సొరంగం లోకి ప్రవేశించింది. అయితే అలానే ఆ మార్గంవైపు వెళ్తుండగా కొండపై నుంచి భారీ బండరాయి జారీ పట్టాలపై పడింది. దాని వలన లోకోపైలట్ అప్రమత్తమై సమయస్పూర్తితో వ్యవహరించడం వల్ల దాదాపుగా వెయ్యి మంది ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే రైలు సొరంగంలోకి ప్రవేశించిన తర్వాత.. ట్రాక్ పక్కనే ఉన్న బండ రాయిని లోకోపైలట్ గమనించారు. వెంటనే అప్రమత్తమై రైలు ఆపారు.
దీంతో పెను ప్రమాదం తప్పింది. రైలులో ఉన్న 1000 మందికి పైగా ప్రయాణికులు ఆ ప్రమాదం నుంచి బయట పడ్డారు. బండరాయి కారణంగా రైలు అక్కడే రెండు గంటలు నిలిచిపోయింది. ఆ క్రమంలోనే కొందరు ప్రయాణికులు పొలాల దారి గుండా రెండు నుంచి మూడు కిలోమీటర్ల వరకు నడుచుకుంటూ ప్రదాన రహదారిపై వచ్చి.. బస్సులు, ఆటోలు ఎక్కి కలబురగికి వెళ్లారు. అనంతరం రైల్వే సిబ్బందికి సమాచారం ఇచ్చిన స్థానికులు ఘటనా స్థలానికి చేరుకొని ట్రాక్ పై ఉన్న బండరాయిని తొలగించారు. ఆ తర్వాత అక్కడ ఆగి ఉన్న రైలు బీదర్ నుంచి కలబురగికి బయలుదేరింది.అయితే రైలు వెళ్తున్న సమయంలో భూమి కంపించడం వలన కొండ చరియలు విరిగిపడినట్లు స్థానికులు తెలియజేస్తున్నారు.