భర్త, భార్య దగ్గర దొరకని ఆనందమోదో పరాయి వ్యక్తుల ఉందని భావించి, వారి మోజులో పడిపోతున్నారు కొంత మంది. కాపురాన్ని చేజేతులా కాలరాసుకుంటున్నారు. అలా ఓ పరాయి వ్యక్తి మోజులో పడిన మహిళ.. అతడితో వెళ్లిపోయి.. ఐదేళ్ల తర్వాత తిరిగొచ్చింది. మనిషిలా కాదూ..
వివాహేతర సంబంధాలు పచ్చని సంసారంలో నిప్పులు పోస్తున్నాయి. ఇవి జీవితాలను ఛిన్నాభిన్నం చేస్తున్నాయి. ఎన్నో ఏళ్ల పాటు హాయిగా సాగిపోతున్న కాపురాల్లో రాక్షసిలా దాపురిస్తున్నాయి ఈ అక్రమ సంబంధాలు. భర్త, భార్య దగ్గర ఈ ఆనందం దొరకడం లేదని పరాయి వ్యక్తుల మోజులో పడిపోతున్నారు. బంగారం లాంటి పిల్లల భవిష్యత్తును బుగ్గిపాలు చేస్తున్నారు. అలా గడపదాటిన మహిళ.. చాన్నాళ్ల తర్వాత సొంత ఇంటికి తిరిగి వచ్చింది. మనిషిలా కాదూ శవమై. నిర్ఘాంత పోయే ఘటన మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ లో చోటుచేసుకుంది.
గ్వాలియర్ లోని షీల్‌నగర్‌కు చెందిన రీనా బదౌరియా (35)కి దశరథ్ సింగ్‌తో ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి కుమారుడు కూడా జన్మించాడు. భర్తతో రెండేళ్లు కాపురం చేసిన తర్వాత సురేంద్ర ధాకడ్ అనే వ్యక్తి ప్రేమలో పడి వివాహేతర సంబంధం పెట్టుకుంది. అనంతరం అతడితో కలిసి పరారైంది. భర్తను, బిడ్డను వదిలేసి అతడితో వెళ్లిపోయింది. ఐదేళ్లుగా అతడితోనే జీవిస్తోంది. అయితే ఓ రోజు రీనా ఆత్మహత్య చేసుకుని చనిపోయిందంటూ దశరథ్ కు ఫోన్ వచ్చింది. ఆమె మృతదేహం అంబులెన్స్‌లో పంపిస్తున్నాడంటూ చెప్పాడు. అంబులెన్స్ దశరథ్ సింగ్ ఇంటికి చేరుకుంది. అయితే ఆమె చెవుల నుండి రక్తం కారినట్లు ఆనవాళ్లు కనిపించాయి.
దీంతో అనుమానం వచ్చిన దశరథ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సురేంద్రను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా అసలు విషయాలు వెల్లగక్కాడు. భర్తను వదిలి రీనా తనతో ఐదేళ్ల క్రితం వచ్చేస్తుందని తెలిపారు. తన దగ్గరకు వచ్చాక.. నాలుగేళ్లు సజావుగా సాగిందని, అయితే ఏడాది క్రితం మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందని సురేంద్ర చెప్పాడు. తనకు తెలియకుండా ఆ వ్యక్తితో తరచూ కలుస్తూ ఉండేదని, ఇటీవల వీరిద్దరూ కలవడం తన కంటపడిందన్నాడు. ఈ విషయంపై తమ మధ్య గొడవ జరిగిందని, ఆగ్రహంతో ఆమెను హత్య చేశానని చెప్పాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి సురేంద్రను అరెస్టు చేశారు. వివాహేతర సంబంధాలు ఎంతటి దారుణానికి ఒడిగడుతున్నాయో ఈ ఘటన ఉదాహరణ. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.