మహా నగరాల్లో క్యాబ్, ఆటో, బైక్ సర్వీసులు చాలా పాపులర్ అయిపోయాయి. రాపిడో సంస్థ వచ్చిన తర్వాత బైక్ సర్వీసులకు కూడా డిమాండ్ పెరిగింది. సరసమైన ధరలకు సింగిల్ పాసింజర్ రైడ్లు ప్రొవేడ్ చేసిన రాపిడో క్యాబ్ సర్వీసెస్ లో సెన్సేషన్ గా నిలిచింది. రాపిడో వచ్చిన తర్వాత ఓలా, ఉబెర్ కంపెనీలకు కూడా బైక్ సర్వీస్ లు బాగా పాపులర్ అయ్యాయి. అద్భుతమైన క్యాష్ బాక్- డిస్కౌంట్ ఆఫర్లతో కస్టమర్లను బాగా ఆకట్టుకుని అతి తక్కువ సమయంలో వెలుగులోకి వచ్చింది.
ఇప్పుడు ఈ రాపిడో సంస్థకు కోర్టు దిమ్మతిరిగే షాకిచ్చింది. బైక్- బైక్ పార్శిల్- ఆటో సర్వీసులను నిషేదించాలంటూ ఆదేశాలను జారీ చేసింది. అసలు అనుమతులు లేకుండా సర్వీసులు నిర్వహిస్తున్నారంటూ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే ఇది హైదరాబాద్ లో కాదులెండి. మహారాష్ట్ర కోర్టు ఈ ఆదేశాలను జారీ చేసింది. మహారాష్ట్రలో రాపిడో సేవలను నిషేదించాలంటూ ఆదేశాలు ఇచ్చింది. టూ వీలర్, టూ వీలర్ పార్శిల్ సర్వీస్, ఆటో సర్వీసులు రద్దు చేయాలని తెలిపింది.
రాపిడో సంస్థకు ఉన్న చట్టబద్ధమైన అనుమతులను అందజేయాలంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కానీ, ఆ పత్రాలను అందజేయడంలో రాపిడో సంస్థ విఫలమైంది. అసలు అనుమతులు లేకుండా, ఎలాంటి పత్రాలు లేకుండానే సర్వీసులు కొనసాగిస్తుందని తెలుసుకుని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. జనవరి 20 నుంచి మహారాష్ట్రలో రాపిడోపై బ్యాన్ విధించనున్నట్లు ప్రకటించింది. అయితే రాపిడో వాదన మరోలా ఉంది. తాము అనుమతుల కోసం ప్రయత్నాలు చేశామంటు చెప్పుకొచ్చింది.
మహారాష్ట్ర ప్రభుత్వాన్ని అనుమతులు ఇవ్వాలంటూ అభ్యర్థనలు పెట్టినా వారు స్పందించలేదని చెబుతున్నారు. అనుమతులు ఇవ్వలేదని ఆరోపిస్తున్నారు. అయితే మహారాష్ట్ర ప్రభుత్వం ఈ బైక్ సర్వీస్ కు సంబంధించి తమ వద్ద సరైన పాలసీ లేదని చెబుతున్నారు. మరోవైపు సరైన అనుమతులు లేకుండా సర్వీసులు ఎలా అనుమతించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఓలా, ఉబర్ వంటి సంస్థల బైక్ సర్వీసు విషయంలో చర్యలు ప్రారంభించామంటూ ప్రభుత్వం తరఫున కోర్టుకు విన్నవించారు. ఈ విషయాన్ని మరీ సాగదీయకుండా త్వరగా ఒక నిర్ణయం తీసుకోవాలంటూ కోర్టు ఆదేశించింది.