ప్రపంచదేశాల్లో వణుకుపుట్టిస్తోన్న ఒమిక్రాన్ వైరస్ భారత్‌లోనూ ప్రతాపం చూపిస్తోంది. 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కొత్త వేరియంట్ వ్యాప్తి చెందింది. దేశంలో ఒమిక్రాన్ కేసులు అంతకంతకు పెరుగుతుంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 781 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. అందులో 241 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఢిల్లీలో అత్యధికంగా 238 కేసులు, 167 కేసులతో మహారాష్ట్ర ఉన్నాయి.
ఇక గడిచిన 24 గంటల్లో 9,195 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. నిన్న 7,347 మంది కరోనా నుంచి కోలుకున్నారని వివరించింది. ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో 77,002 మంది చికిత్స తీసుకుంటున్నారని తెలిపింది. ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య మొత్తం 3,42,51,292గా ఉందని పేర్కొంది.
ఇది చదవండి : సామాన్యులకు శుభవార్త! మరోసారి తగ్గిన వంటనూనె ధరలు..!
ఇప్పటివరకు దేశంలో 67.52 కోట్ల కరోనా పరీక్షలు చేశారు. మొత్తం 143.15 కోట్ల డోసుల వ్యాక్సిన్లు వినియోగించారు. కొత్త వేరింయట్ ప్రభావంతో జిల్లాల స్థాయిలో జనవరి 31వరకు కంటెయిన్ మెంట్ మెజర్స్ అమలు చేయాలని కేంద్ర హోంశాఖ ఆదేశాలిచ్చింది.144 సెక్షన్ విధించాలని స్పష్టం చేసింది. తెలంగాణలో మొత్తం 62 ఒమిక్రాన్ కేసులు నమోదుకాగా, వారిలో 10 మంది కోలుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఆరు ఒమిక్రాన్ కేసులు నమోదుకాగా, ఒకరు కోలుకున్నారు.
#Unite2FightCorona#LargestVaccineDrive#OmicronVariant
𝗖𝗢𝗩𝗜𝗗 𝗙𝗟𝗔𝗦𝗛https://t.co/dYfu0FWNzn pic.twitter.com/AKP7K4buOn
— Ministry of Health (@MoHFW_INDIA) December 29, 2021