ఈ మధ్య కాలంలో ప్రజలపై మీమ్స్ ప్రభావం గట్టిగానే ఉంటోంది. నేరుగా చెప్పిన దానికంటే ఓ మీమ్ వేస్తే ఇంకా వేగంగా ప్రజల్లోకి దూసుకెళ్తోంది. ఆ విషాన్ని ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు అందుపుచ్చుకున్నారని చాలా సందర్భాల్లో చూశాం. ఇప్పుడు కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ కూడా ఆ ట్రెండ్ ను ఫాలో అవుతోంది. కరోనాపై అవగాహన కల్పించేందుకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రీసెంట్ బ్లాక్ బస్టర్ పుష్ప సినిమా మీమ్ ను వాడేసింది.
ప్రస్తుతం బాలీవుడ్ లో పుష్ప ఫీవర్ నడుస్తోంది అనడంలో సందేహం లేదు. సెలబ్రిటీల మొదలు, క్రికెటర్ల వరకు అందరూ పుష్ప లుక్స్, డైలాగ్స్, సాంగ్స్ తో మీమ్స్, రీల్స్ తో సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ ట్రెండ్ నే కేంద్ర ప్రభుత్వం కూడా వాడేసింది. కరోనాపై అవగాహన కల్పించేందుకు #IndiaFightsCorona, @CovidNewsByMIB పేరుతో సమాచార మంత్రిత్వ శాఖ ఓ ట్విట్టర్ పేజ్ ను క్రియేట్ చేశారు. వాటిలో కరోనా అప్ డేట్స్ తో పాటుగా అవగాహన కూడా కల్పిస్తున్నారు.
#Pushpa..#PushpaRaj ho ya koi bhi,
Our fight against #COVID19 is still on!
🛡️Keep following #COVIDAppropriateBehaviour 👇
✅Always wear a #mask
✅Wash/sanitize hands regularly
✅Maintain distancing
✅Get fully #vaccinated#IndiaFightsCorona #We4Vaccine @alluarjun @iamRashmika pic.twitter.com/Mlzj9tnWL5— #IndiaFightsCorona (@COVIDNewsByMIB) January 19, 2022
అందులో భాగంగానే తాజాగా పుష్ప మీమ్ క్రియేట్ చేసి పోస్ట్ చేశారు. అందులో అల్లు అర్జున్ డైలాగ్ ను రీమేక్ చేశారు. పుష్పరాజ్ కు మాస్క్ వేసి.. ‘డెల్టా కానీ, ఒమిక్రాన్ కానీ, మాస్క్ తీసేదేలే’ అంటూ డైలాగ్ ని పెట్టారు. పుష్ప.. పుష్పరాజ్.. ఎవరైనా! కరోనాపై మన పోరు ఇంకా కొనసాగుతూనే ఉంది. తప్పనిసరిగా కరోనా నిబంధనలు పాటించండి. తప్పక మాస్కు ధరించండి, టీకా తీసుకోండి, శానిటైజ్ చేసుకోండి, భౌతికదూరం పాటించండి’ అంటూ పోస్టు చేశారు. అల్లు అర్జున్, రష్మికలను ఈ పోస్టుకు ట్యాగ్ చేశారు. సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ పోస్టు వైరల్ గా మారింది. కేంద్ర ప్రభుత్వ ప్రయత్నంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.