ప్రస్తుతం చాలా మంది ఉద్యోగులకు ప్రభుత్వాల నుంచి శుభవార్తలు అందుతున్నాయి. ఇప్పటికే చాలా మంది దీపావళి బోనస్‌లు కూడా ప్రకటించారు. ఇప్పుడు ఆ జాబితాలోకి మరికొంత మంది ఉద్యోగులు చేరారు. వారికి ఏకంగా 78 రోజుల జీతాన్ని బోనస్‌గా ఇవ్వనున్నట్లు కేంద్రం ప్రకటించింది. అవును ఆ శుభవార్త చెప్పింది రైల్వే ఉద్యోగులకే. కేంద్ర కేబినెట్ మీటింగ్‌లో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆ విషయాన్ని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియాతో వెల్లడించారు. అయితే ఈ బోనస్ నాన్ గెజిటెడ్ ఉద్యోగులకు మాత్రమే ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఎప్పటిలాగానే ఈ ఏడాది కూడా రైల్వే ఉద్యోగులకు దీపావళి కానుగా ఈ బోనస్ ఇస్తున్నట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు.
ఇక బోనస్ వివరాలకు వస్తే.. దీపావళి కానుక ఇచ్చేందుకు మొత్తం రూ.1,832.09 కోట్లను విడుదల చేశారు. రైల్వే శాఖలోని 11.27 లక్షల మంది ఉద్యోగులకు ఈ బోనస్ అందించనున్నారు. రైల్వే ఉద్యోగులకు 78 రోజుల జీతాన్ని బోనస్‌గా ఇవ్వనున్నట్లు వెల్లడించారు. గరిష్టంగా బోనస్ రూ.17,951 ఉంటుందని స్పష్టం చేశారు. ఈ బోనస్ కేవలం నాన్ గెజిటెడ్ ఉద్యోగులకు మాత్రమే అని తెలిపారు. ట్రాక్ మెయిన్‌టినర్స్, డ్రైవర్స్, గార్డ్స్, స్టేషన్ మాస్టర్స్, సూపర్‌వైజర్స్, టెక్నీషియన్స్, టెక్నీషియన్ హెల్పర్స్, కంట్రోలర్, పోయింట్స్ మన్, మినిస్ట్రియల్ స్టాఫ్, గ్రూప్ సీకి చెందిన ఉద్యోగులకు కేంద్రం ఈ బోనస్ అందించనుంది. కేంద్రం చెప్పిన ఈ తీపికబురుతో రైల్వే ఉద్యోగులు సంబరాలు చేసుకున్నారు.
Cabinet has approved a Productivity Linked Bonus of Rs 1,832 crores for 11.27 lakh employees of railways.
The bonus will be for 78 days with a maximum amount of Rs 17,951 per beneficiary: Union Minister @ianuragthakur #CabinetDecisions pic.twitter.com/bvniD3rVBA
— PIB India (@PIB_India) October 12, 2022