ఇటీవల వివాహ వేడుకలు చాలా వెరైటీగా జరుపుకుంటున్నారు. ప్రీ వెడ్డింగ్ షూట్ మొదలు పెళ్లి మండపంలో జరిగే కార్యక్రాల వరకు వెరైటీగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఎవరి స్థోమతను బట్టి వారు తమ పెళ్లి వేడుకలు గ్రాండ్ గా ఉండేలా చూస్తున్నారు. కొన్నిసార్లు పెళ్లి వేడుకల్లో చిత్ర విచిత్రాలు జరుగుతుంటాయి..అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే.
సోషల్ మీడియా వచ్చినప్పటి ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి. కొన్ని నవ్వు పుట్టించే విధంగా ఉంటే.. కొన్ని ఆశ్చర్యాన్ని, భయాన్ని కలిగించే విధంగా ఉంటున్నాయి. తాజాగా ఓ పెళ్లి వేడుకలో ఎద్దులు సృష్టించిన బీభత్సానికి అందరూ హడలిపోయారు. పెళ్లి మండపంలో ఏం జరుగుతుందో అని భయాందోళనకు గురయ్యారు.. ఈ ఘటన గుజరాత్ లో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళితే.
గుజరాత్ చలాలా గ్రామంలో ఓ పెళ్లి వేడుకలో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. పెళ్లి మండపం వద్ద వధూవరులు వచ్చే సమయానికి వారికన్నా ముందు రెండు ఎద్దులు వచ్చాయి.. ఆవేశంగా దూసుకు వచ్చిన ఎద్దులు సుమారు ముప్పావుగంట వరకు కొట్లాడుకున్నాయి. అంతే పెళ్లి వేడుకకు వచ్చిన ఇరు కుటుంబాల సభ్యులు, బంధు మిత్రులు దూరంగా పారిపోయారు. సురక్షితమైన ప్రదేశంలో భయంతో దాక్కున్నారు. ఆ ఎద్దులు ఎవరిమీదకు వచ్చి పడతాయో అని కొద్ది సేపు భయం భయంగా గడిపారు. గొడవ పడుతున్న ఎద్దులపై కొంతమంది ధైర్య చేసి నీళ్లు చల్లారు.. రాళ్లతో కొట్టారు.. కానీ ఆ ఎద్దులు మాత్రం కొట్లాడటం ఆపలేదు.
మరోవైపు పెళ్లి మండపంలో కొట్లాడుకుంటున్న ఎద్దులను తమ సెల్ ఫోన్లో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది కాస్త నెట్టింట తెగ వైరల్ అయ్యింది. మొత్తానికి ఆ రెండు ఎద్దులను శాంతింపజేసి దూరంగా తరిమారు. అయితే ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. మొత్తానికి పెళ్లి తంతు ఘనంగా ముగిసింది. అందరూ వధూవరులను ఆశీర్వదించారు. ఈ మద్య పెళ్లి వేడుకలో చిత్ర విచిత్రాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఆ మద్య ఓ బీజేపీ నేత తనయుడు పెళ్లికి నోట్ల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. మరో పెళ్లికొడుకు ఊరేగింపులో ఖరీదైన కార్లు వదిలి సాంప్రదాయ పద్దతిలో ఎద్దుల బండిపై కళ్యాణ మండపానికి చేరుకున్నాడు.. ఈ ఘటన గుజరాత్ లో చోటు చేసుకుంది.
— Hardin (@hardintessa143) March 14, 2023