దేశ రాజధాని ఢిల్లీ నగరం ఓ భవనం రోడ్డుపై కుప్పకూలిపోయింది. భారీ శబ్దంతో భవనం కూలిపోవడంతో స్థానికులు భయాందోళనతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలంకి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు.
ఇటీవల తరచూ ఏదో ఒక ప్రాంతంలో భవనాలు కుప్పకూలిన ఘటనలు చోటుచేసుకున్నాయి. వివిధ కారణాలతో ఈ భవనాలు కుప్పకూలిపోతున్నాయి. అలానే ఈ ప్రమాదంలో ఎందరో అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. అలానే మరేందరో తీవ్ర గాయాలతో జీవితాన్ని ఎంతో కష్టం మీద సాగిస్తున్నారు. ఇటీవలే హైదరాబాద్ లోని కూకట్ పల్లి ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న భవనంలో నాలుగు, ఐదు అంతస్తులు కుప్పకూలిపోయాయి. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. తాజాగా దేశ రాజధాని ఢిల్లీ నగరంలో ఓ భవనం రోడ్డుపై కుప్పకూలిపోయింది. ప్రస్తుతం ఈవీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇటీవల టర్కీ దేశంతో పాటు పరిసర ప్రాంతాల్లో వచ్చిన భూకంపం ధాటికి పెద్ద పెద్ద భవనాలు పేక మేడల్లా కూలిపోయాయి. అంతేకాక ఆ భవనాల శిథిలాల కింద వేలాది మంది ప్రాణాలు విడిచారు. భవనాలు కూలిపోతున్న దృశ్యాలు అందరిని భయాందోళనకు గురి చేశాయి. తాజాగా ఢిల్లీ నగరంలోని భజన్ పూర్ ప్రాంతంలో ఓ భవనం కుప్పకూలింది. బుధవారం భజన్ పూర్ ప్రాంతంలో ఓ భవనం రోడ్డుపై కుప్పకూలింది. భారీ శబ్ధంతో భవనం రోడ్డుపై కుప్పకూలడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడి చేరుకున్నారు. కూలిపోవడానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని పోలీసు అధికారులు తెలిపారు. రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోంది పోలీసులు తెలిపారు. గతంలో ఉత్తర ఢిల్లీలోని రోషనారా రోడ్‌లో మంటలు చెలరేగడంతో నాలుగు అంతస్తుల భవనం కూలిపోయింది, అయితే అదృష్టవశాత్తూ, ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని పోలీసులు తెలిపారు. తాజాగా భజన్ పూర్ లో కుప్పకూలిన భవనం కు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
#WATCH | Delhi: A building collapsed in Vijay Park, Bhajanpura. Fire department present at the spot, rescue operations underway. Details awaited
(Video Source – Shot by locals, confirmed by Police) pic.twitter.com/FV3YDhphoE
— ANI (@ANI) March 8, 2023