ఫస్ట్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఆఫ్ ఇండియా బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ తమిళనాడులోని కూనూరు అటవీ ప్రాంతంలో కుప్పకూలింది. ప్రమాదంలో బిపిన్ రావత్ సతీమణి సహా 13 మంది మరణించినట్లు వార్తలు వస్తున్నాయి. వెల్లింగ్టన్ లో లెక్చర్ ఇచ్చేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. ల్యాండ్ అయ్యేందుకు 5 నిమిషాల ముందు ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. సైన్యానికి సంబంధించిన హెలికాప్టర్లు, విమానాలు కూలిన ఘటనలు చూశాం. కానీ, సీడీఎస్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కూలడంతో అసలు కారణాలను కనుగొనేందుకు ఎయిర్ ఫోర్స్ దర్యాప్తు మొదలు పెట్టింది. బిపిన్ రావత్ ప్రయాణించిన MI-17V5 ఎంత వరకు సురక్షితమో పరిశీలిద్దాం.
CDS General Bipin Rawat is battling for his life in Military Hospital, Wellington. Please pray for his speedy recovery 🙏🏽 pic.twitter.com/3bBQaQ3z7Y
— Shikha Dhariwal (@ShikhaaDhariwal) December 8, 2021
సీడీఎస్ బిపిన్ రావత్ ప్రయాణించిన MI-17V5 హెలికాప్టర్ ఎంతో సురక్షితమైనదిగా పేరుంది. MI సిరీస్ లోనే అత్యంత భద్రత కలిగినదిగా పేరొందడంతో.. దేశంలో వీవీఐపీలు, వీఐపీల పర్యటనలకు దీనినే వాడుతున్నారు. ప్రస్తుతం ప్రధాని మోదీ పర్యటనలకు కూడా దీనినే వాడుతున్నారు. సైనిక రవాణాకు వినియోగించే MI8 నుంచి ఈ హెలికాప్టర్ ను అభివృత్ధి చేశారు. ఎలాంటి వాతావరణంలోనైనా ప్రాయణించగలగడం దీని ప్రత్యేకత. ఎడరాలు, అడవులు, సముద్రాలపై సురక్షితంగా ప్రయాణించేలా తయారు చేశారు. సహాయ చర్యల్లోనూ దీనిని వినియోగిస్తారు. కమాండోలను జార విడిచేందుకు కూడా దీనిని వినియోగిస్తారు. ఇది దాదాపు 36 మంది సైనికులు లేదా 4.5 టన్నుల బరువును రవాణా చేయగలదు. దీనిలో మరో ప్రత్యేకత ఏంటంటే ఇంధన ట్యాంక్ పేలినా కూడా మంటలు వ్యాపించకుండా ఏర్పాటు చేసి ఉంటాయి. పాలీయూరేథీన్ అనే సింథటిక్ ఫోమ్ రక్షణ కవచంగా ఉంటుంది. ఇది గంటకు 250 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు.
“MI-17 is almost like the AK-47 of the helicopter world. It’s Russian-made and has been around forever…The IAF helicopter pilots are some of the most revered in the world because of the areas they operate in,” says Former RAF Pilot @mikeykaynyc#BipinRawat #CDSRawat pic.twitter.com/4loeqA0pAk
— WION (@WIONews) December 8, 2021
రష్యాకు చెందిన రోసోబోర్న్ ఎక్స్ పోర్టు నుంచి 80 హెలికాప్టర్లను కొనుగోలు చేసింది. 2008 నుంచి 2013 కల్లా 80 హెలికాప్టర్లను డెలివరీ చేశారు. ఆ తర్వాత కూడా 71 హెలికాప్టర్లను కొనుగోలు చేసే ప్రక్రియ జరిగింది. చివరిసారి 2018లో ఈ హెలికాప్టర్ భారత్ కు అందింది. ఈ హెలికాప్టర్ ప్రమాదాల్లో చిక్కుకోవడం చాలా అరుదని నిపుణులు భావిస్తున్నారు. ఇప్పటి వరకు భారీ ప్రమాదాలేవీ సంభవించలేదని చెప్తున్నారు. బాలాకోట్ దాడుల తర్వాతి ఘటనల్లో దేశ గగనతల రక్షణ వ్యవస్థ పొరపాటును ఈ హెలికాప్టర్ ను కాల్చింది.