పెళ్లి తర్వాత భార్యాభర్తల మధ్య ప్రేమ తగ్గుతూ వస్తుంది. ఇద్దరి మధ్యా ఓ అలావాటు ఏర్పడుతుంది. చాలా మంది దీన్నే ప్రేమగా భ్రమిస్తుంటారు. కానీ, చాలా కొద్ది మంది మాత్రమే నిజమైన ప్రేమను అనుభూతి చెందుతూ ఉంటారు.
ప్రేమ అనేది తియ్యటి అనుభూతి మాత్రమే కాదు. అంతకు మించిన ఆత్మీయ అనుబంధం కూడా. సృష్టి పుట్టినప్పటినుంచి ప్రేమలో ఎలాంటి మార్పులు రాలేదు. ఆ ప్రేమ అనుభవించే వారి మనస్తత్వాల్లో తప్ప. ప్రేమ నిజమైనది అయినపుడు అందులో.. నిజమైన ప్రేమ అన్న క్వచ్ఛన్ లేదు. మనుషులను బట్టి ప్రేమలో తేడాలు ఉంటాయి. ఓ వ్యక్తిని మనస్పూర్తిగా ప్రేమిస్తే వారికోసం ఎంత వరకైనా వెళతాం. వారు మనకు దూరం అయినా కూడా వారి జ్ఞాపకాలు మరణం వరకు తోడుంటాయి. ప్రేమలోని కొన్ని జ్ఞాపకాలు మన జీవన విధానాలుగా కూడా మారిపోతాయి. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణే.. బిహార్‌కు చెందిన భోలానాథ్, పద్మరాణిల కథ. ఈ స్టోరీ పెళ్లికి ముందు ప్రేమ అన్న ప్రసక్తి లేదు. అయినా కూడా వీరి ప్రేమకథ చరిత్రలో నిలిచిపోయింది.
బిహార్‌లోని సిఫాయ్ తోలాకు చెందిన భోలానాథ్, పద్మారాణిలది పెద్దలు కుదిర్చిన పెళ్లి. పెళ్లి తర్వాత ఒకరి కోసం ఒకరు అన్నట్లుగా ఇద్దరి జీవితాలు మారిపోయాయి. భార్యాభర్తలిద్దరూ ఒక్కటే అన్నట్లుగా వారి మధ్య అనుబంధం పెనవేసుకుపోయింది. భార్యకు కష్టం వస్తే భర్త.. భర్తకు కష్టం వస్తే భార్య విలవిల్లాడిపోయేవారు. అయితే, వీరి ప్రేమను చూసి విధికి కన్నుకుట్టింది. 1990 మే 25న పద్మారాణి మరణించింది. భార్య మరణంతో భోలానాథ్ ఒకరకంగా పిచ్చివాడయ్యాడు. ఆమె లేని జీవితాన్ని ఊహించుకోలేకపోయాడు.
చావు శరణ్యం అనుకున్న అతడు పిల్లల కోసం ఆగిపోయాడు. భార్య అంత్యక్రియల తర్వాత ఇంటికి తీసుకువచ్చిన అస్తికలను ఇంటి దగ్గరలోని ఓ చెట్టుకు కట్టాడు. దానికి నిత్యం పూజలు చేయటం మొదలుపెట్టాడు. దాదాపు 32 ఏళ్ల పాటు ఇలా చేశాడు. ప్రతి రోజు ఓ గులాబి పువ్వును ఆ చెట్టు కింద పెట్టేవాడు. తల వంచి భార్యకు నమస్కారం చేసేవాడు. భార్యను దేవతలా భావించి ఇవన్నీ చేసేవాడు. తన చివరి శ్వాస వరకు ఇలానే చేశాడు.
ఈ 32 ఏళ్లలో ఏనాడూ అతడు భార్య అస్తికలకు పూజలు చేయకుండా లేడు. అదో వ్యసనంగా గడిపేవాడు. తాను చనిపోయిన తర్వాత తన అస్తికలను కూడా భార్య అస్తికలతో కలిపి ఆ చెట్టుకు వేలాడతీయాలని పిల్లలకు తరచూ చెప్పేవాడు. భోలానాథ్ భార్య దగ్గరకు వెళ్లే రోజు రానే వచ్చింది. జూన్ 24, 2022న భోలానాథ్ మరణించాడు. అతడి మరణం తర్వాత అంత్యక్రియలు జరిపిన కుటుంబసభ్యులు భోలానాథ్ అస్తికలను.. అతడి భార్య పద్మారాణి అస్తికలతో పాటు ఓ కుండలో ఉంచారు. దాన్ని అదే చెట్టుకు వేలాడదీశారు.
దీనిపై భోలానాథ్ అల్లుడు మాట్లాడుతూ.. ‘‘ మా మామ గారు తర్వాతి తరాలకు ఓ ఉదాహరణగా నిలుస్తున్నారు. ఆయనకు తన భార్య పట్ల ఉన్న ప్రేమ, ఆప్యాయత మనకు ప్రేమకు సంబంధించిన ఓ పాఠాలను నేర్పుతాయి. మా మామ గారు చనిపోగానే వారి ప్రేమ కథకు పులుస్టాప్ పడిందని అందరూ భావించారు. కానీ, అలా జరగలేదు. ఆయన కోరిక ప్రకారం మేము ఇద్దరి అస్తికలను కలిపి ఓ కుండలో ఉంచాం. ఆ కుండకు పూజలు చేస్తూ ఉన్నాము. ఇంటినుంచి బయటకు వెళ్లే టప్పుడు. బయటినుంచి ఇంట్లోకి వచ్చేటప్పుడు. ఆ కుండకు నమస్కరిస్తాం’’ అని తెలిపాడు. మరి, ఈ అంతం లేని ప్రేమ కథపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.