ఒడిశాలోని బాలేశ్వర్ జిల్లాలో వద్ద జరిగిన రైళ్ల ప్రమాదం యావత్ భారత దేశాన్ని ఒక్కసారి ఉలిక్కిపడేలా చేసింది. పొరపాటు ఏదైనా.. వందల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు.
ఒడిశాలో కోరమండల్ ఎక్స్ ప్రెస్ ఆగి ఉన్న గూడ్స్ రైలును ఢీ కొట్టిన విషయం తెలిసిందే. ప్రమాదంలో ఇప్పటికీ 288పైగా మరణించారు. వెయ్యిమందికి పైగా గాయపడి చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా రైలు ప్రమాద ఘటన చర్చనీయాంశంగా మారింది. రైల్వే అధికారులు వెంటనే స్పందించి రైలు పునరుద్దరణ పనులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ప్రమాదంలో రోజు రోజుకు మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. రెస్క్యూ టీం చేసిన పొరపాటు వల్ల ఒక నిండు ప్రాణం బలి అయి ఉండేది. కానీ ఓ తండ్రి నమ్మకం యువకుడు ప్రాణాలతో బయటపడ్డాడు. అసలు ఏం జరిగింది.. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఒడిశాలో రైలు ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య పెరిగిపోతుంది. ఈ క్రమంలో హేలరామ్ మాలిక్ తన కొడుకు బిస్వజిత్ మాలిక్(24) షాలిమార్ స్టేషన్ లో కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ను ఎక్కించాడు. ఎక్కించిన కొద్దిసేపటికే.. రైలు ప్రమాదం జరిగిందని న్యూస్ ద్వారా హేలారామ్ కు తెలిసింది. ప్రమాదంలో చాలా మంది చనిపోయారనే వార్త విన్న హేలారామ్ ఒక్కసారిగా గుండె ఆగినంత పనైంది. అయితే తన కొడుకు చనిపోలేదు అన్న గట్టి నమ్మకం హేలరామ్ కి ఉంది.. ఈ క్రమంలోనే స్థానిక అంబులెన్స్ తీసుకొని 230 కిలోమీటర్ల ప్రయాణించి బాలాసోర్ దగ్గరికి చేరుకున్నాడు. అక్కడ బాలాసోర్ లో ప్రతి ఒక్క హాస్పిటల్ లో కొడుకు కోసం వెతికాడు.. ఎక్కడ కూడా తన కొడుకు ఆచూకీ కనిపించలేదు.
తన నమ్మకాన్నీ మాత్రం వదులుకోకుండా.. నా కొడుకు ఇంకా ప్రాణాలతో ఉన్నాడని బలంగా అనుకున్నాడు. చివరగా మార్చురీ మాత్రమే ఒక్కటి మిగిలి ఉంది. అక్కడ అంతా వెతకగా.. తన కొడుకు బిస్వజిత్ మాలిక్ కనిపించాడు. కొడుకును ఆ స్థితిలో చూసిన హేలారామ్ తట్టుకోలేకపోయాడు.. కొడుకుపై పడి గుండెలు పగిలేలా ఏడ్చాడు. అంతలోనే బిస్వజిత్ చేయి చిన్నగా కదిలింది.. అది గమనించిన పల్స్ చెక్ చేయగా.. బిస్వజిత్ గుండె కొట్టుకుంటూనే ఉంది. వెంటనే తనతో వచ్చిన అంబులెన్సె డ్రైవర్ సహాయం తీసుకొని తన కొడుకు బిస్వజిత్ ని హాస్పిటల్ కి తరలించాడు. చికిత్సానంతరం.. మెరుగైన వైద్యం కోసం కోల్‌కత్తా కు తీసుకువెళ్లాడు. తను ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. అతనికి చీలమండ లో ఆపరేషన్ జరిగింది. దీనిపై స్పందించిన అధికారులు.. అపస్మారక స్థితిలో ఉన్న బిస్వజిత్ ను చనిపోయాడు అనుకున్నాం.. అప్పుడు మాకు ఏం తెలియనప్పటికి మార్చురీకి తరలించాం అన్నారు. మొత్తానికి ఓ తండ్రి ప్రేమ, నమ్మకం తన కొడుకు ప్రాణాలు నిలిపిందని నెటిజన్లు తండ్రికి హ్యాట్సాఫ్ చెబుతున్నారు.