ఈ రోజుల్లో కొన్ని చోట్ల చిత్ర విచిత్ర సంఘటనలు జరుగుతున్నాయి. సోషల్ మీడియా వల్ల నిమిషాల్లో అందరికి తెలసిపోతున్నాయి. రాజస్థాన్ లో వింత శిశువు జన్మించిన ఘటన అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.
మనం అప్పుడప్పుడు చాలా విచిత్రంగా పుట్టిన శిశువులను చూస్తుంటాం. సాధారణ శిశువు చేతులకు, కాళ్లకు ఐదు వేళ్ళు ఉంటాయి. కానీ కొంతమంది ఆరు వేళ్లతో జన్మిస్తారు. మరికొంతమంది రెండు తలలతో, శరీరాలు అతుక్కుని, శరీర భాగాలు వేరుగా ఉండి తలలు అతుక్కుని జన్మిస్తారు. ప్రస్తుతం తల్లి గర్భంలో ఉండగానే అనారోగ్య శిశువులను గుర్తిస్తున్నారు. ఈ రోజుల్లో ఒక స్త్రీ ప్రగ్నెంట్ అయిన తర్వాత డాక్టర్‌ని కలిసి ప్రతి నెల పరీక్షలు చేయిస్తారు. తల్లి, బిడ్డల ఆరోగ్య పరిస్థితులను నెలనెల చెక్ చేసి, స్కానింగ్ తీసి తగిన మందులు వాడుకోవాలి. లేదంటే శిశువు అబ్‌నార్మల్‌గా పుట్టే ప్రమాదం ఉంది. తాజాగా రాజస్థాన్‌లో ముఖానికి తొండం ఉన్న బాలుడు జన్మించాడు. అయితే దానికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం..
రాజస్థాన్ దౌసా జిల్లాలో ఓ ఘటన అందరిని షాక్ కు గురి చేసింది. ముఖానికి తొండం ఉన్న బాలుడు జన్మించాడు. ఆ శిశువు జన్మించిన 20 నిమిషాల్లోనే చనిపోయాడు. దీంతో వినాయకుడి రూపంలో ఉన్న శిశువు జన్మించాడని స్థానికులకు తెలియగానే పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. ఈ ఘటన గత నెల 31న జరిగింది. జన్యుపరమైన లోపాల వల్ల ఇలాంటి శిశువులు జన్మిస్తారని డాక్టర్లు వెల్లడించారు. అంతేకాకుండా గర్భిణీలు తప్పకుండా స్కానింగ్ పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు. ప్రస్తుతం ఈ వార్త వైరల్ అవుతోంది.