కొందరు మితిమీరిన వేగంతో వాహనాలను డ్రైవ్ చేస్తుంటారు. అలాంటి నిర్లక్ష్యపు డ్రైవింగ్ తో అనేక మంది అమాయకుల ప్రాణాలను గాల్లో కలిసిపోతున్నాయి. అదే విధంగా అడవులు, జాతీయ పార్కుల గుండా వెళ్లే సమయంలో కూడా వాహనాలు అతి వేగంగా వెళ్లి..మూగ జీవాలను ఢీ కొడుతున్నాయి. ఈక్రమంలో అనేక జంతువులు బలైపోతున్నాయి. మరికొన్న అదృష్టం బాగుండి.. ప్రాణాలతో బయపడుతున్నాయి. కానీ కొన్ని జీవాలు తీవ్ర గాయాలతో జీవితాంతం అల్లాడుతుంటాయి. తాజాగా అస్సాంలోని కజిరంగా నేషనల్ పార్క్‌లో.. ఓ ఖడ్గమృగాన్ని ఓ లారీ బలంగా తాకింది. రోడ్డు దాటడానికి ప్రయత్నిస్తున్న ఖడ్గమృగం అక్కడే అడ్డంగా పడిపోయింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటనపై అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ సీరియస్ అయ్యారు.
ఆదివారం అస్సాంలోని కజిరంగా నేషనల్ పార్క్‌లో ఓ ఖడ్గమృగాన్ని ఓ లారీ ఢీ కొట్టింది. జంతువులు తిరిగే ఆ పార్క్ లో నిదానంగా వెళ్లాలి అనే జ్ఞానాన్ని మరచిన ఆ డ్రైవర్..మితిమీరిన వేగంతో వెళ్లాడు. అదే సమయంలో రోడ్డు దాటడానికి ఓ ఖడ్గమృగం అటుగా వచ్చింది. ఈ సమయంలోనే లారీ రోడ్డుపైకి వచ్చిన ఖడ్గమృగాన్ని బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటన జరిగాక.. ట్రక్కు డ్రైవర్ ఆగకుండా వెళ్లిపోయాడు. ఖడ్గమృగం కూడా మొదట క్షేమంగా ఉన్నట్లు కనిపించింది.అయితే తీవ్ర గాయాలతో కొద్దిసేపు రోడ్డుపై అలానే పడిపోయింది. అప్రమత్తమైన అధికారులు ప్రస్తుతం దానికి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో క్లిప్‌ను అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ షేర్ చేశారు. ఆ లారీ జోర్హాట్ నుంచి గౌహతి వైపు వెళుతుండగా.. హల్దీబారి ఎనిమల్ కారిడార్ వద్ద ఆ జంతువును ఢీకొన్నట్లు అక్కడి అధికారులు వెల్లడించారు.
ఈ ఘటనపై ఆ రాష్ట్ర సీఎంతో సహా అధికారులు సీరియస్ అయ్యారు. జాతీయ రహదారిపై ఖడ్గం ఢీ కొట్టినందుకు ఆ లారీకి భారీగా జరిమానా విధించారు. ఆ విషయాన్ని స్వయంగా ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ వెల్లడించారు. ‘ఖడ్గమృగాలు తమకు ప్రత్యేక స్నేహితులు. తాము వాటి స్థలంపై ఎలాంటి ఉల్లంఘనను అనుమతించబోం. హల్దీబారీలో జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం. ప్రమాదానికి కారణమైన వాహనాన్ని పట్టుకొని జరిమానా విధించాము. కజిరంగా పార్క్ లో జంతువులను రక్షణ కోసం తాము ప్రత్యేక కార్యాచరణను రూపొందిస్తున్నాం. ప్రత్యేకంగా 32 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్‌ను ఏర్పాటు చేస్తున్నాం’ అని అస్సాం సీఎం వివరించారు.
A truck was fined for hitting a rhinoceros on a highway in the Kaziranga National Park area in Assam, Chief Minister Himanta Biswa Sarma said on Sunday, stressing that his government will not allow infringement on their space. pic.twitter.com/5JYTSwzkoR
— TIMES NOW (@TimesNow) October 10, 2022