నిత్యం వేల మందితో ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేరవేస్తున్న ఇండియన్ రైల్వే, అప్పుడప్పుడు చోటుచేసుకుంటున్న రైలు ప్రమాదాలతో ఆందోళన కలుగజేస్తుంది. ఇదే సమయంలో సమర్ధవంతమైన మంత్రి ఉన్నప్పుడు రైలు ప్రమాదాల నివారణకు తీసుకునే చర్యలు, ప్రమాదాలు జరిగినపుడు స్పందించిన తీరు ప్రయాణికులకు ఇండియన్ రైల్వే పట్ల విశ్వాసాన్ని పెంచుతున్నాయి.
ఏ క్షణానికి ఎలాంటి ముప్పు ముంచుకొస్తుందో ఊహించలేము. హఠాత్తుగా చోటుచేసుకున్న ప్రమాదాలు వ్యక్తుల జీవితాలను, కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తాయి. జూన్ రెండోతారీఖున జరిగిన ఘోర రైలు ప్రమాదంలో ప్యాసింజర్లు కొంత మంది మృత్యువాత పడ్డారు. మరికొంత మంది తీవ్రగాయాలపాలై ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కోరమండల్ ఎక్స్ ప్రెస్, హౌరా ఎక్స్ ప్రెస్, గూడ్స్ రైళ్లు ఢీకొన్న ఘటనలో ఊహించని పెను విషాదం చోటుచేసుకుంది. యావత్ దేశాన్ని కుదిపేసిన ఈ ఘటన జరిగిన వెంటనే రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పందించి, సహాయక చర్యలు చేపట్టిన తీరు ప్రతిఒక్కరిని ఆలోచింపజేస్తుంది.
మూడు రైళ్లు ఢీకొట్టుకున్న ఘటనలో వందలాది కుటుంబాల్లో చీకట్లు అలుముకున్నాయి. తమ ఆత్మీయులను కోల్పోయి తీవ్ర దుఖంలో మునిగిపోయారు. అయితే ప్రమాదం జరిగిన తరువాత రైల్వే డిపార్టు మెంట్, ఎన్డీఆర్ బృదాలు, స్థానికులు యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టి ప్రయాణికులను రక్షించారు. కాగా రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రమాద ఘటన పట్ల తను స్పందించిన తీరు, ఆయన అంకితభావం ఇది వరకు పనిచేసిన రైల్వే మంత్రులకంటే భిన్నంగా ఉంది. శక్తి వంచన లేకుండా నిరంతరం సహాయక చర్యలను పర్యవేక్షిస్తూ, అధికారులతో కలిసి ప్రమాదానికి గల కారణాలను తెలుసుకుంటూ తన భాద్యతలను నిర్వర్తించారు.
సంఘటన జరిగిన తరువాత ధ్వంసమైన ట్రాక్ ను తొలగిచి నూతన ట్రాక్ ను 51 గంటల్లో పునరుద్దరించి రైళ్లు యథావిదిగా ప్రయాణాలు కొనసాగించేలా చర్యలు తీసుకున్నారు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్. ట్రాక్ పునరుద్దరణ, దానికి సంబంధించిన మరమ్మతుల పనుల పురోగతిపై ఎప్పటికప్పుడు అధికారులను సమన్వయం చేసుకుంటూ రైళ్ల రాకపోకలు యథావిదిగా సాగేలా కృషి చేశారు. ట్రాక్ పునరుద్దరించిన అనంతరం గూడ్స్ రైల్ తో ట్రయల్ రన్ నిర్వహించారు. ఆ తరువాత ప్యాసింజర్ రైళ్ల రాకపోకలను అనుమతించారు. అయితే ఈ సమయంలో అక్కడే ఉన్న రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ట్రయల్ రన్ జరుగుతున్న సమయంలో రెండు చేతులు జోడించి నమస్కరించిన తీరుపై ప్రశంసలు కురుస్తున్నాయి. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇదిలా ఉండగా రైలు ప్రమాద ఘటనపై ప్రతిపక్షాలు, ప్రభుత్వం పై విమర్షలు గుప్పించాయి. జరిగిన ఘటనకు బాధ్యతవహిస్తూ రైల్వే మంత్రి రాజీనామా చేయాలని పలువురు నాయకులు డిమాండ్ చేశారు. కానీ ఈ విమర్షలేమి పట్టించుకోకుండా అశ్వినీ వైష్ణవ్ తన విధులను సమర్థవంతంగా నిర్వర్తించారు.
Down-line restoration complete. First train movement in section. pic.twitter.com/cXy3jUOJQ2
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) June 4, 2023