న్యూఢిల్లీ- పాఠశాల విద్యార్థుల చేత సూర్య నమస్కారాలు చేయించాలంటూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ (ఏ ఐ ఎల్ పీ ఎం బీ) నిరసన వ్యక్తం చేస్తోంది. ఇది ఇస్లాంకు వ్యతిరేకం అని తెలిపింది. ఆ వివరాలు.. స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా ఆజాదీ కా అమృత మహోత్సవ్ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. దీనిలో భాగంగా దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని పాఠశాలల్లో విద్యార్థుల చేత వారం రోజుల పాటు సూర్య నమస్కారాలు చేయించాలని ఆదేశించింది.
జనవరి 1 నుంచి 7 వ తేదీ వరకు అన్ని పాఠశాలల విద్యార్థులు సూర్య నమస్కారాలు చేయాలని కేంద్రం తెలిపింది. ఈ ఆదేశాలపై ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు స్పందించింది. సూర్య నమస్కారం అంటే.. సూర్యుడిని ఆరాధించడం అని.. ఈ విధానాన్ని ఇస్లాం అనుమతించదని స్పష్టం చేసింది. ఈ మేరకు ముస్లిం పర్సనల్ లా బోర్డు ఒక ప్రకటన విడుదల చేసింది.
All India Muslim Personal Law Board opposes Govt directive to organize ‘Surya Namaskar’ program in schools between Jan 1-Jan 7 on the 75th anniversary of Independence Day; says ‘Surya Namaskar’ is a form of Surya puja and Islam does not allow it pic.twitter.com/KcUq2xAGIm
— ANI (@ANI) January 4, 2022