పెళ్లి.. రెండు మనసులను, కుటుంబాలను దగ్గర చేస్తుంది. వివాహం చేసుకునేముందు అటు ఏడు తరాలు.. ఇటు ఏడు తరాలు చూడాలంటారు. కానీ నేటి తరం యువత మాత్రం.. మనసులు కలిస్తే చాలు.. ఇంకేం అక్కర్లేదు అంటున్నారు. అంతస్తులతో సంబంధం లేదు.. అర్థం చేసుకునే భాగస్వామి అయితే చాలని భావిస్తున్నారు. నేటి కాలంలో ఆస్తిపాస్తులు లేకపోయినా పర్లేదు కానీ.. తమ ఆలోచనలని, అభిప్రాయాలని గౌరవించి.. విలువిచ్చే వారైతే చాలని భావిస్తున్నారు. ఇక వివాహ విషయంలో ఆడ పిల్లలకు కూడా ప్రస్తుత కాలంలో కాస్త స్వేచ్ఛ లభిస్తోంది. దాంతో తమ మనసుకు నచ్చిన వరుడిని ఎంపిక చేసుకోగల్గుతున్నారు. ఇక తల్లిదండ్రులు కూడా పిల్లల సంతోషమే ముఖ్యం అనుకుంటున్నారు. ఈ క్రమంలో తాజాగా ఓ పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
మహిళా ఎమ్మెల్యే ఒకరు వివాహం చేసుకుని టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచారు. సాధారణంగా ఎమ్మెల్యే అంటే.. తన స్థాయికి తగ్గ వ్యక్తినే వివాహం చేసుకుంటుందని భావిస్తాం. కానీ ఇప్పుడు మీరు చూడబోయే ఎమ్మెల్యే మాత్రం.. అందరి అంచనాలు తలకిందులు చేస్తూ.. ఏకంగా పార్టీ కార్యకర్తను వివాహం చేసుకున్నారు. ఎంతో నిరాడంబరంగా జరిగిన ఈ వివాహ వేడుకకు ముఖ్యమంత్రి హాజరయ్యి.. నూతన దంపతులును ఆశీర్వదించాడు. ఆ వివరాలు..
పంజాబ్ ఆప్ ఎమ్మెల్యే నరిందర్ కౌర్ భరాజ్ ఆ పార్టీ కార్యకర్త మణ్‌దీప్ సింగ్‌ను వివాహం చేసుకుంది. పటియాలాలోని రోరేవాల్ గ్రామంలోని ఓ గురుద్వారాలో శుక్రవారం వీరి వివాహం జరిగింది. అత్యంత నిరాడంబరంగా జరిగిన ఈ పెళ్లికి పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ హాజరయ్యి.. నూతన దంపతులను ఆశీర్వదించారు. నరిందర్ కౌర్ భరాజ్ స్వస్థలం సంగ్రూర్‌లోని భరాజ్ గ్రామం. ఆమె తండ్రి వ్యవసాయం చేసి కుటుంబాన్ని పోషించేవాడు. ఇక నరిందర్ కౌర్ పటియాలాలోని పంజాబ్ యూనివర్సిటీలో ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసింది.
ఇక 2014 ఎన్నికల సమయంలో నరిందర్ కౌర్ తన గ్రామంలో ఒంటరిగా ఆమ్ ఆద్మీ పార్టీ బూత్ ఏర్పాటు చేసి.. అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ క్రమంలో భగవంత్ మాన్ ప్రోత్సాహంతో రాజకీయాలపై దృష్టి పెట్టింది. ఇక ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సంగ్రూర్ ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించింది. అంతేకాక.. పంజాబ్‌లో అతి చిన్న వయసులో ఎమ్మెల్యే అయిన మహిళగా గుర్తింపు పొందింది. ఇక నరిందర్ వివాహం చేసుకున్న మణ్‌దీప్ సింగ్ గతంలో సంగ్రూర్ జల్లా ఆప్ మీడియా ఇంఛార్జ్‌గా వ్యవహరించాడు. ఈ క్రమంలో వీరి పెళ్లి ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.