తమ తల్లిదండ్రులు ఉద్యోగాల్లో పదవీవిరమణ పొందిన రోజు.. రకారకాల కానుకలు ఇస్తుంటారు పిల్లలు. తమ స్థాయికి తగ్గట్టుగా వాహనాలు, మొబైల్ ఫోన్స్, బంగారు నగలు ఇలా రక రకాలుగా రిటైర్మెంట్ గిఫ్ట్ అందిస్తుంటారు. ఓ వ్యక్తి మాత్రం తన తల్లి రిటైర్మ్మెంట్ రోజు ఎప్పటికీ గుర్తుండిపోయేలా గిఫ్ట్ ఇచ్చాడు. హెలికాప్టర్లో తిప్పి.. ఇమె స్వగ్రామానికి తీసుకు వచ్చాడు. ఈ ఘటన రాజస్థాన్ అజ్మేర్లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
అజ్మేర్ లోని తోప్ బ్రా లో ఉంటున్న సుశీలా చౌహాన్ ప్రభుత్వ స్కూల్ లో టీచర్ గా పనిచేస్తున్నారు. గత 33 ఏళ్ళుగా ఆమె విధులు నిర్వహిస్తూ శనివారం పదవీ విరమణ చేశారు. ప్రస్తుతం ఆమె కుమారుడు అమెరికాలో ఉన్నత ఉద్యోగం లో స్థిరపడ్డాడు. ప్రభుత్వ టీచర్ గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి తన తల్లి అన్ని బాధ్యతలు చక్కబెట్టేదని.. తాను ఉన్నత చదువు కోసం ఆమె అహర్శశలూ తన కోసం కష్టపడిందని ఆమెకు జీవితంలో గొప్ప సర్ ప్రైజ్ ఇవ్వాలని ప్లాన్ చేశాడు యోగేశ్.
తన తల్లి పదవీ విరమణ చేయడానికి నాలుగు రోజుల ముందే స్వగ్రామం చేరుకున్నాడు యోగేశ్. శనివారం రోజు సుశీలా చౌహన్ పదవీ విరమణ చేసిన అనంతరం ఆమెను హెలికాప్ట లో తన స్వగ్రామానికి తీసుకు వచ్చాడు. తన కొడుకు చేసిన పనికి మొదట ఆశ్చర్యపోయినా.. ఎప్పిటి నుంచో హెలికాప్టర్ ఎక్కాలన తన కోరికను తీర్చినందుకు ఉబ్బితబ్బిబై పోయింది సుశీల చౌహన్. తల్లి కోసం తనయుడు చేసి ఈ పనికి గ్రామస్థులు ఎంతగానో ప్రశంసించారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.