ఇక నాకు, నీకు పొసగదు అని తెలిశాక భార్యా భర్తలు విడాకుల కోసం కోర్టు మెట్లెక్కుతారు. అయితే ఎక్కువ సందర్భాల్లో భర్త శారీరక, మానసిక వేధింపులను తట్టుకోలేక భార్య.. డివోర్స్‌కు అప్లై చేస్తుంది. న్యాయమూర్తి పక్షపాతంగా విచారణ జరపడం, ఆర్డర్స్ ఇచ్చే అవకాశాలు చాలా తక్కువ.
ఇక నాకు, నీకు పొసగదు అని తెలిశాక భార్యా భర్తలు విడాకుల కోసం కోర్టు మెట్లెక్కుతారు. అయితే ఎక్కువ సందర్భాల్లో భర్త శారీరక, మానసిక వేధింపులను తట్టుకోలేక భార్య.. డివోర్స్‌కు అప్లై చేస్తుంది. వాదోప వాదాలు జరిగి.. నిజ నిర్ధారణ తేల్చి దంపతులకు విడాకులు మంజూరు చేస్తుంది కోర్టు. న్యాయ వ్యవస్థలోని చట్టాల ప్రకారం తీర్పు ఉంటుంది. అంతేగానీ.. న్యాయమూర్తి పక్షపాతంగా విచారణ జరపడం, ఆర్డర్స్ ఇచ్చే అవకాశాలు చాలా తక్కువ. కానీ విడాకుల కేసులో తనకు న్యాయం జరగడం లేదంటూ ఓ భర్త.. కోర్టులోనే రచ్చ చేశాడు. తీర్పునిచ్చిన జడ్డిపైనే తిరుగుబావుటా ఎగురవేశాడు. ఇంతకు ఏమైంది.. ఇంతకు అతడు ఏం చేశాడంటే..?
విడాకుల కేసులో తనకు అన్యాయం జరిగిందంటూ ఓ భర్త.. కోర్టు ఆవరణలో ఉన్న జడ్డి కారును ధ్వంసం చేశాడు. ఈ ఘటన కేరళలోని పథనం తిట్ట జిల్లా తిరువళ్లా కోర్టులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 2017లో ఓ విడాకుల కేసు స్థానిక కోర్టుకు వచ్చింది. అయితే ఆ కోర్టుపై తనకు నమ్మకం లేదంటూ దానిని మరొక కోర్టుకు బదిలీ చేయాలని సదరు భర్త కేరళ హైకోర్టును ఆశ్రయించాడు. దీంతో అతడి అభ్యర్థనను అంగీకరించిన కోర్టు.. తిరువళ్లా కోర్టుకు బదిలీ చేస్తూ ఆదేశాలిచ్చింది. ఈ కోర్టులో ఆరేళ్లుగా విచారణ జరుగుతూనే ఉంది. దీనిపై అసంతృప్తి వ్యక్తం చేసిన భర్త.. జడ్జిపై బురద జల్లడం ప్రారంభించాడు.
తన భార్యే విడాకుల కోసం అప్లై చేసిందని, తన గోడును న్యాయవాది, జడ్జి కుమ్మక్కై వినిపించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ఈ కేసులో సహజ న్యాయం జరగడం లేదన్న ఆవేదనతో కోర్టు నుండి బయటకు వచ్చిన సదరు వ్యక్తి.. కోర్టు ఆవరణలో ఉన్న జడ్జి కారుపై దాడి చేశాడు. కోర్టు లోపలి నుంచి బయటకురాగానే ఎదురుగా కనిపించిన జడ్జి కారు అద్దాలు పగులగొట్టి, వాహనం ధ్వంసం చేశాడు.దీంతో నిందితుడ్ని అదుపులోకి తీసుకొని ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు తిరువళ్లా పోలీసు అధికారి తెలిపారు. ఆ దాడి చేసిన వ్యక్తి యువకుడు అనుకుంటే పొరపాటు.. 55 ఏళ్ల వ్యక్తి కావడం గమనార్హం.