ఈ రోజుల్లో గుండెపోటు సమస్యతో చాలా మంది బాధపడుతున్నారు. ఇటు చిన్నపిల్లల నుంచి అటు పండు ముసలి వయసు వాళ్ల వరకు ఇలా వయసు తేడా లేకుండా అందరూ గుండెపోటు బారిన పడుతున్నారు. ఇదిలా ఉంటే గుండెపోటుతో మన దేశంలో రోజుకొక చోట చాలా మంది మరణిస్తున్నారు. తాజాగా కర్ణాటకలో సైతం అచ్చం ఇలాంటి ఘటనే వెలుగు చూసింది. 6వ తరగతి బాలుడు ఆడుకుంటూ గుండెపోటుతో మరణించాడు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది.
కర్ణాటక మడికేరి జిల్లా కూడుమంగళూరు ప్రాంతంలో మంజాచారి అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇతనికి కీర్తన్ అనే కుమారుడు ఉన్నాడు. మంజాచారి స్థానికంగా స్కూల్ బస్సు డ్రైవర్ గా పని చేస్తూ కుటుంబాన్నిపోషిస్తున్నాడు. అయితే అతని కుమారుడు కీర్తన్ స్థానికంగా ఓ పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నాడు. ఇకపోతే కీర్తన్ శనివారం సాయంత్రం తన ఫ్రెండ్స్ తో కలిసి ఆడుకుంటున్నాడు. అయితే సడెన్ గా ఆ బాలుడికి గుండెలో నొప్పిగా అనిపించింది. దీంతో నిమిషం నిమిషానికి ఆ నొప్పి విపరీతంగా రావడం మొదలైంది.
దీనిని గమనించిన ఆ కీర్తన్ తల్లిదండ్రులు వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. కానీ ఫలితం లేకపోవడంతో కీర్తన్ అప్పటికే ప్రాణాలు కోల్పోయాడని వైద్యులు నిర్ధారించారు. కుమారుడు గుండెపోటుతో మరణించడంతో అతని తల్లిదండ్రులకు గుండె కోత మాత్రమే మిగిలింది. ఇక కుమారుడు రాడు. కనిపించడనే చేదు నిజాన్ని జీర్ణించుకోలేక గుండెలు పగిలేలా ఏడ్చారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. 12 ఏళ్ల వయసులోనే కీర్తన్ గుండె పోటుతో చనిపోవడంతో స్థానిక ప్రజలకు భయందోళనలకు గురవుతున్నారు. గుండెపోటుతో మరణించిన ఈ బాలుడి ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.