సాధారణంగా దొంగలు ఇంట్లో బంగారం, విలువైన వస్తువులు, డబ్బులు దొచుకెళ్తుంటారు. కొంతమంది విచిత్రమైన దొంగలు ఈ మద్య రోడ్లపై ఉన్న బల్బులు, గోడపై పెట్టిన పూలమొక్కలు సైతం దొంగతనం చేయడం చూశాం. కానీ ఓ ఊరిలో దొంగలు ఏకంగా రెండు కిలో మీటర్ల రోడ్డునే మాయం చేశారు. రోజూ నడిచే రోడ్డు తెల్లారే సరికి కనిపించకపోవడంతో గ్రామస్థులు షాక్ కి గురయ్యారు. ఈ విచిత్ర ఘటన బిహార్ లో చోటు చేసుకుంది.
బీహార్ లోని ఖరౌనీ, కదాంపూర్ ఊళ్లను కలుపుతూ దాదాపు రెండు కిలో మీటర్ల వరకు రోడ్డు ఏర్పాటు చేశారు. కొంతకాలంగా ఇదే రోడ్డుపై ఇరు గ్రామాల ప్రజలు రాకపోకలు సాగించేవారు. ఐదు రోజు క్రితం బాగానే ఉన్న రోడ్డు స్థానంలో ఇప్పుడు పొలం ఉండటంతో అటుగా వచ్చిన గ్రామస్థులు తాము ఏమైనా దారి తప్పిపోయామా అన్న అనుమానం కలిగింది. అంతకు ముందు రోజే ఆ రోడ్డుపై తాము నడిచామని.. రాత్రికి రాత్రే రోడ్డు తొలగించి గోదుమ పంట వేయడంతో కదంపూర్ గ్రామస్థులు షాక్ కి గురయ్యారు. తర్వాత అసలు విషయం తెలుసుకొని ఆగ్రహానికి గురయ్యారు.
ఎన్నో ఏళ్లుగా ఉపయోగిస్తున్న రోడ్డును ఖైరానీ గ్రామానికి చెందిన కొంత మంది గుండాలు ట్రాక్టర్లతో రెండు కిలోమీటర్ల మేర తవ్వి అక్కడ గోదుమ పంట వేసినట్లు గుర్తించారు. ఈ విషయాన్ని నిలదీసేందుకు కదంపూర్ గ్రామస్థులు ఖైరానీ గ్రామస్థులను నిలదీసేందుకు వెళ్లారు.. అక్కడ కొంతమంది గుండాలు కర్రలు, మారణాయుధాలు పట్టుకొని తమను బెదిరించారని అధికారులకు తమ గోడు విన్నవించుకున్నారు. అంతేకాదు ఖదంపూర్ గ్రామస్థులు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. ఈ ఘటనపై విచారణ జరిపిస్తామని.. ఆక్రమించుకున్న చోట తిరిగి రోడ్డును నిర్మిస్తామని అధికారులు హామీ ఇచ్చినట్టుగా వార్తలు వస్తున్నాయి. తాజాగా దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
बिहार में रातों-रात गायब हो गई सड़क, एफआईआर दर्ज..
पूरी खबर जानने के लिए लिंक पर क्लिक करें…https://t.co/6duztkYxkM pic.twitter.com/7eXzV3SLUV— Rajesh Kumar Ojha (@RajeshK_Ojha) November 30, 2022