జీవితంలో విజయం సాధించాలనే తపన ఉండాలే కానీ వయస్సు అడ్డంకి కాదు. అలా వయస్సును సైతం లెక్క చేయకుండా అద్భుత విజయాలు సాధించిన వారు ఎందరో ఉన్నారు. అలాంటి వారి జాబితాలో తాజాగా 104 ఏళ్ల బామ్మ చేరింది. మరి.. ఆమె సాధించిన ఆ ఘనత ఏంటంటే..
ప్రతి ఒక్కరికీ జీవితంలో ఎదో ఒకటి సాధించాలని కోరిక ఉంటుంది. కానీ కోరిక ఉన్న ప్రతి ఒక్కరు వాటిని సాధించలేరు. ఎందుకంటే గెలుపు అనేది ఎవరికీ ఊరికే రాదు. దాని కోసం కృషి, పట్టుదలతో శ్రమిస్తేనే సాధ్యం అవుతుంది. కానీ కొంత మంది ఒకటి, రెండు సార్లు విఫలం చెందగానే ఇక తాము జీవితంలో ఏమి సాధించలేమని నిరాశకు లోనవుతుంటారు. కానీ కొందరు మాత్రం వృద్ధాప్యం వచ్చిన సరే.. ఏదో ఒకటి సాధించాలనే కసితో ఉంటారు. అందుకే అలాంటి వారు జీవితమంతా ఓడిన.. చివర రోజుల్లో విజయం సాధించి.. చరిత్ర సృష్టిస్తుంటారు. అలాంటి వారిని ఎందరినో మనం చూశాం. తాజాగా ఆ జాబితాలోకి 104 ఏళ్ల బామ్మ చేరింది. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన లిటరసీ టెస్ట్ లో 100 కు 89 మార్కులు సాధించింది ఆ బామ్మ. ఆమెను కీర్తిస్తూ ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్ర సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఈ వార్త నెటింట్లో తెగవైరల్ అవుతోంది.
దేశంలోని ప్రముఖ వ్యాపారుల్లో ఆనంద్ మహీంద్ర ఒకరు. ఇక ఈయన పేరు తెలియని వారు ఉంటరంటే అతిశయోక్తి కాదు. కేవలం బిజినెస్ వార్తలను చూసే వారికే కాక, సోషల్ మీడియాలను ఉపయోగించే సామాన్యులకు కూడా ఆయన సుపరిచితం. అనేక రకాల వీడియోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసే పారిశ్రామిక వేత్తల్లో ఆనంద్ మహీంద్ర ముందుంటారు. ఆయన తరచూ ప్రేరణాత్మకు వీడియోలను, ఫోటోలోను షేర్ చేస్తుంటారు. మహీంద్ర షేర్ చేసే వీడియోలు కొన్ని ఆశ్చర్యం కలిగించేవిగా ఉంటాయి. మరికొన్ని నవ్వులు తెప్పిస్తాయి. అలానే కొన్ని ఫోటోలు యువతకు స్ఫూర్తి నింపేలా ఉంటాయి.
తాజాగా 104 ఏళ్ల బామ్మ ఫోటోలను షేర్ చేశారు. అందులో వింత ఏముంది అనే సందేహం మీకు రావచ్చు. ఆమె సాధించిన ఘనత తెలిస్తే అందరు ఆశ్చర్యానికి లోనవుతారు. కేరళ రాష్ట్రానికి చెందిన 104 ఏళ్ల కుట్టియమ్మ అనే బామ్మ.. ఆ రాష్ట్రం నిర్వహించిన అక్షరాస్యత మిషన్ పరీక్షలో 89/100 మార్కులు సాధించింది. ఎట్టకేలకు తాను అనుకున్నది సాధించడంతో చిరునవ్వుతో ఆనందం వ్యక్తం చేసింది. మీ కలల కోసం పోరాడండి, ఏ మాత్రం నిర్లక్ష్యం చేయవద్దు అంటూ ఆ బామ్మ యువతకు సందేశం ఇచ్చింది. ఆమెకు దేశం నలువైపుల నుంచి ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి. ఈ క్రమంలో పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్ర .. ఆ బామ్మసాధించిన ఘనతను సోషల్ మీడియా లో షేర్ చేశారు.
“పాఠశాలకు వెళ్లే ప్రతి చిన్నారికి ఈ బామ్మ కథ ఒక పాఠంగా నిలుస్తుంది. ఈ పెద్దావిడ ముఖంలో కనిపిస్తున్న భావ వ్యక్తికరణ మనం విద్యను సాధించడం ఎంత అవసరమో తెలియజేస్తుంది. అంతేకాక ఆమె ఘనత మనందరికీ ఒక పాఠం. ప్రతి రోజూ ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకునే అలవాటు నుంచి జీవితంలో గొప్ప ఆనందం, సంతృప్తి వస్తుంది” అంటూ పోస్ట్ చేశారు. చూశారా.. నిరాశ, నిస్పృహలతో జీవితాలను నాశనం చేసుకునే యువత.. మరణం దగ్గర పడుతున్నా విజయం కోసం పరుగులు తీస్తున్న బామ్మను స్ఫూర్తిగా తీసుకోవాలి. మరి.. ఈ బామ్మ సాధించిన ఘనతపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
A lesson for every school-going child:the expression on this lady’s face shows how privileged you are to receive an education. And a lesson to all of us:The greatest joy & satisfaction in life comes from the privilege of learning something new every single day. #MondayMotivation https://t.co/bZhkZGefg7
— anand mahindra (@anandmahindra) February 13, 2023