రోజు రోజుకు మనుషుల్లో మానవత్వం, సహనం, ఓపిక నశిస్తున్నాయి. చిన్న చిన్న సంఘటనలు కూడా పెద్ద నేరాలకు దారి తీస్తున్నాయి. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి బెంగళూరులో చోటు చేసుకుంది. సెల్ ఫోన్ దొంగిలించాడని ఓ మత్స్యకారుడిని తోటి మత్స్యకారులు బోటుకు తలకిందులుగా వేలాడదీసి కొట్టారు. ఈ నెల 15న మంగళూరు ఫిషింగ్ హార్బర్‌లో లంగరు వేసిన బోటులో చోటు చేసుకున్న ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఇది కూడా చదవండి : సాకారమైన అవిభక్త కవలల కల!
దొంగతనానికి పాల్పడ్డ వ్యక్తిపై మత్స్యకారుల బృందం దాడి చేసిన వీడియో వైరల్ కావడంతో పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. బాధితుడు వైలా శీను అని గుర్తించారు. బోటులోని వేయింగ్ మెషీన్‌కు ఉండే హుక్కు శీనును తలకిందులుగా వేలాడదీసి, తాళ్లతో కట్టేసినట్లు వీడియోలో కనిపించింది. ఈ కేసులో ఆ గ్యాంగ్‌కు చెందిన మొత్తం ఆరుగురిని అరెస్ట్ చేశామని, వారంతా ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారని మంగళూరు పోలీసులు తెలిపారు. హత్యాయత్నం కేసు పెట్టి విచారిస్తున్నట్లు వెల్లడించారు.
Inhuman incident Reported @Mangaluru, #Karnataka. where a fellow #fisherman stolen a cell phone was hung upside down in a boat and brutally attacked by other fishermens. In this regard #Police registered a case and arrested 6 accused.#Bengaluru #KSP #bommai #karnatakapolice pic.twitter.com/fD85WYqOLq
— Bharathirajan (@bharathircc) December 23, 2021
ఇది కూడా చదవండి : భర్త నోట ఆ మాట.. తట్టుకోలేకపోయిన ఆ మహిళ షాకింగ్ నిర్ణయం