సాధారణంగా సోషల్ మీడియాలో ఫేమ్ అయినవారు షార్ట్ ఫిలిమ్స్ లో కనిపించడం మామూలే. షార్ట్ ఫిలిమ్స్ తో పాటు సోషల్ మీడియాలో గ్లామరస్ ఫోటో షూట్స్, ప్రైవేట్ సాంగ్స్ చేస్తుంటారు. అయితే.. ఇవన్నీ చేసి సినిమాలలో ఎంట్రీ ఎప్పుడు ఇస్తారనేది సస్పెన్స్. కొందరు టిక్ టాక్ వీడియోస్ ద్వారా కూడా హీరోయిన్స్ అయిపోయారు. అది వాళ్ళ అదృష్టం అనుకోవచ్చు. కానీ.. కొందరు వివాదాల ద్వారా వెలుగులోకి వస్తుంటారు. ఆ వివాదాలతోనే పాపులర్ అవుతుంటారు. అలా ఓ ఘటనతో వార్తలో నిలిచిన వ్యక్తి.. ఖుషిత కల్లపు.
ఖుషిత కల్లపు షార్ట్ ఫిలిమ్స్ నటిస్తూ, ఇతర డబ్ ష్మాష్ వీడియోలు చేస్తూ మంచి పాపులారిటీ సంపాదించింది. అయితే ఆ మధ్య హైదరాబాద్ లో ఓ ప్రముఖ పబ్ పై జరిగిన దాడులో ఈ అమ్మడు చిక్కింది. పబ్ కి బజ్జీలు తినడానికి వెళ్ళానని అప్పట్లో పోలీసుల విచారణలో తెలిపింది. దీంతో ఈ అమ్మడు “బజ్జీల పాప”గా పాపులర్ అయింది. ఇక సోషల్ మీడియా క్రేజ్ తో ఇంస్టా గ్రామ్ రీల్స్, పలు షార్ట్ ఫిలిమ్స్ లో నటించిన ఖుషిత.. అదృష్టం నక్కతోక తొక్కిందని అంటున్నాయి సినీవర్గాలు. ఎందుకంటే.. ఖుషిత ఇప్పుడు బజ్జీల పాప కాదు సినిమా హీరోయిన్. టాలీవుడ్ మాస్ రాజా రవితేజ.. సొంత ప్రొడక్షన్ సంస్థలో తెరకెక్కనున్న సినిమాలో హీరోయిన్ ఛాన్స్ కొట్టేసినట్లు సమాచారం. ఇలా బిజి బిజిగా ఉంటున్న ఈ అమ్మడు.. సోషల్ మీడియాలో తనకు సంబంధించిన పిక్స్ పోస్ట్ చేస్తుంది.
అందాలు ఆరబోస్తూ కుర్రాళ్ల మతి పోగొడుతోంది. అయితే తాజాగా ఈ అమ్మడు నల్ల రంగు చీరలో అందాలు ఆరబోస్తూ.. క్యూట్ గా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. మత్తెక్కించే చూపులతో కుర్రాళ్ల మతిపోగోటేస్తోంది ఈ హాట్ బ్యూటీ. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ‘కేరాఫ్ కంచరపాలెం’ ఫేమ్ కార్తీక్ రత్నం హీరోగా నటిస్తున్న సినిమాలో హీరోయిన్ గా ఖుషిత కల్లపు అదేనండీ బజ్జీల పాప నటించనుంది. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న ఖుషిత పిక్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
#changurebangaruraja new project, yellow Thursdays! With @RaviTeja_offl deeply humbled! 😄 pic.twitter.com/qjT5gBt2xm
— Kushithakallapu (@kushithakallapu) August 11, 2022