హైదరాబాద్‌లోని ముచ్చింతల్‌లో చినజీయర్ స్వామి నేతృత్వంలో జరగుతున్న శ్రీ రామానుజాచార్యుల సమతామూర్తి విగ్రహావిష్కరణ కార్యక్రమం వివాదాలకు కేంద్రంగా మారనుందా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి.
శ్రీ రామానుజాచార్యుల విగ్రహావిష్కరణకు ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరు కాగా.. సీఎం కేసీఆర్ అస్వస్థత కారణంగా మోదీకి స్వాగతం పలకలేదు. దీనిపై ఇప్పటికే పలు విమర్శలు వస్తుండగా.. తాజాగా కేటీఆర్ సమతామూర్తి విగ్రహావిష్కరణపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వివక్షకు మారుపేరైన వ్యక్తి.. సమతామూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఇది సమతామూర్తి స్పూర్తికి విరుద్ధమన్నారు. ఈ క్రమంలో కేటీఆర్ చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరలవుతోంది.
Icon of Partiality unveiled #StatueOfEquality
And Irony just died a billion deaths!!
— KTR (@KTRTRS) February 6, 2022