సినీ ఇండస్ట్రీకి సంబంధించి సెలబ్రిటీలు తమ ఫ్యామిలీతో రెగ్యులర్ గా విదేశీ టూర్స్ కి వెళ్తుంటారని తెలిసిందే. కానీ.. అప్పుడప్పుడు దైవ దర్శనాలు కూడా చేసుకుని వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా దక్షిణాది స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ తన భర్తతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. సోమవారం ఉదయం కాజల్ తన భర్త గౌతమ్ కిచ్లుతో విఐపి దర్శన సమయంలో శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ప్రస్తుతం కాజల్ దంపతులకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
శ్రీవారి దర్శనం అనంతరం తిరుమల అధికారులు కాజల్ దంపతులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఆ తర్వాత బయటికి వచ్చాక ఫ్యాన్స్ తో ఫోటోలు దిగిన కాజల్.. తన భర్తతో తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం ఇదే మొదటిసారి అని చెప్పింది. అలాగే శ్రీవారిని చాలా రోజుల తర్వాత దర్శనం చేసుకోవడం ఆనందంగా ఉందని, శ్రీవారి దర్శనాన్ని విజయవంతం చేసిన టిటిడి అధికారులకు కృతజ్ఞతలు తెలిపింది కాజల్. ఇదిలా ఉండగా.. కాజల్ అగర్వాల్ ఇటీవల పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉండగా.. టాలీవుడ్ లో కాజల్ అగర్వాల్ కొన్నేళ్లపాటు స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగింది. చిరంజీవి మొదలుకొని మహేష్ బాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్, ప్రభాస్, ఎన్టీఆర్ ఇలా అందరూ స్టార్స్ సరసన సినిమాలు చేసింది. అయితే.. పెళ్లి తర్వాత సినిమాలు తగ్గించిన కాజల్.. ఈ ఏడాది కొడుకు నీల్ కి జన్మనివ్వడంతో మొన్నటి వరకు ఇంటివద్దే ఉంది. ఇప్పుడు మళ్లీ సినిమాలు చేసేందుకు రెడీ అవుతోంది కాజల్. ప్రస్తుతం కాజల్ చేతిలో కమల్ హాసన్ – శంకర్ కాంబోలో వస్తున్న ‘ఇండియన్ 2’ మూవీ ఉంది. మరి త్వరలో కొత్త సినిమాలు అనౌన్స్ చేయనుందేమో చూడాలి.