ఎస్‌ఎస్ రాజమౌళి.. ఒక దర్శకుడిగా తెలుగునాట మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సాధించిన డైరెక్టర్. తెలుగు సినిమా స్థాయిని, ఇండియన్ సినిమా రేంజ్‌ని ప్రపంచం మొత్తం రీసౌండింగ్ వచ్చేలా చేసిన ఘనత మాత్రం రాజమౌళికే దక్కుతుంది. అందుకే ఆయనను అంతా దర్శక ధీరుడు అని పిలుస్తుంటారు. ఇటీవలే ట్రిపులార్ సినిమాతో సూపర్ డూపర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం జక్కన్న, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ దంపతులు జపాన్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. జపనీస్ లాంగ్వేజ్‌లో ట్రిపులార్ సినిమా విడుదల సందర్భంగా వీళ్లంతా జపాన్‌లో పర్యటిస్తున్నారు.
రాజమౌళి తీసిన సినిమాల్లో బహుబలి-1, బహుబలి-2 సినిమాలు జక్కన్న రేంజ్‌ని వరల్డ్ వైడ్‌గా చాటిచెప్పాయి. ఆ సినిమాలో ప్రతి సీన్, ప్రతి షాట్, ప్రతి డైలాగ్ ప్రేక్షకులను కట్టిపడేశాయనే చెప్పాలి. ముఖ్యంగా ప్రభాస్- అనుష్క- రానా కాంబోలో వచ్చే సీన్స్ అయితే నెక్ట్స్ లెవల్ అనే చెప్పాలి. ముఖ్యంగా బాహుబలి-2లో అనుష్క కోర్టుకు హాజరవుతున్న సమయంలో సేనాధిపతి ఆమెను తాకే ప్రయత్నం చేస్తే అనుష్క అతని వేళ్లను కట్ చేస్తుంది. అప్పుడు కోర్టులోకి వచ్చిన బాహుబలి ఆడదానితో తప్పుగా ప్రవర్తిస్తే.. నరకాల్సింది వేళ్లు కాదు.. తల అంటూ కత్తితో తల నరికేస్తాడు. సినిమా మొత్తంలో చాలా హై ఇన్‌టెన్సిటీ ఉండే సన్నివేశం అది. ఇప్పుడు ఆ సన్నివేశాన్ని ఏకంగా హాలీవుడ్ కాపీ కొట్టిందని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు.
అవును మీరు చదివింది నిజమే.. బాహుబలి-2 కోర్టు సీన్‌ని హాలీవుడ్ కాపీ కొట్టింది. హాలీవుడ్ నుంచి వచ్చిన గేమ్ ఆఫ్ థ్రాన్స్ అనే వెబ్ సిరీస్ గురించి ప్రత్యేకంగా ఇంట్రడక్షన్స్ ఇవ్వాల్సిన అసరం లేదు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఈ సిరీస్‌కి ఎంతో గొప్ప ఆదరణ, అభిమానులు ఉన్నారు. ఆ సిరీస్‌కు ఉన్న ఆదరణ దృష్ట్యా హౌస్ ఆఫ్ ది డ్రాగన్ అంటూ ప్రీక్వెల్ కూడా తీసుకొచ్చారు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో ఈ వెబ్‌సిరీస్ స్ట్రీమ్ అవుతోంది. ఇప్పుడు ఆ ప్రీక్వెల్ జక్కన్న కోర్టు సీన్‌ని కాపీ కొట్టారు. హౌస్ ఆఫ్ ది డ్రాగన్ ఎపిసోడ్ 8లో ఆ సీన్ ఉంది. అచ్చు బాహుబలిలో లాగానే ఈ సీన్‌లో కూడా కత్తితో తల నరికేశారు. అయితే ఇది చూసిన వారంతా జక్కన్న హాలీవుడ్ కాపీ కొట్టిందంటూ నెట్టింట ఆ సీన్‌ని వైరల్ చేస్తున్నారు. అంతేకాదు.. ఫ్యూచర్‌లో రాజమౌళి తీసే చాలా సినిమాలోని సీన్లను హాలీవుడ్ కాపీ కొడుతుంది అని గర్వంగా చెప్పుకుంటున్నారు.