ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ అత్యంత విజయవంతమైన జట్టు. ముంబై ఇండియన్స్ తర్వాత CSK అత్యధిక సార్లు ఐపీఎల్ విజేతగా నిలిచింది. ధోని సారథ్యంలో ఆ జట్టు ఏకంగా 4 సార్లు ఐపీఎల్ ట్రోఫీ సాధించింది. అతంటి ఘనమైన రికార్డు ఉన్న టీమ్ 14 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో మొదటి సారి తొలి రెండు మ్యాచ్‌లలో ఓటమి చవిచూసింది. ఇప్పటి వరకు CSK ఒక్క సారికూడా వరుసగా తొలి రెండు మ్యాచ్‌లలో ఓడిపోలేదు. కానీ ఐపీఎల్ 2022 సీజన్‌లో తొలి మ్యాచ్‌లో కోల్‌కత్తా నైట్ రైడర్స్ చేతిలో, గురువారం కొత్త టీమ్ లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో ఓడిపోయింది. నిన్నటి మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై ఓపెనర్ ఊతప్ప, యంగ్‌బ్యాటర్ శివమ్ దూబే చెలరేగడంతో 210 పరుగుల భారీ స్కోర్ సాధించింది. కానీ బౌలర్ల వైఫల్యంతో అంత పెద్ద టార్గెట్ సైతం కాపాడుకోలేకపోయింది. దీంతో CSKకు రెండో ఓటమి తప్పలేదు.
కెప్టెన్సీ లోటు..
దాదాపు 12 సీజన్లు CSKకు ధోని కెప్టెన్‌గా వ్యవహరించాడు. మొత్తం 14 సీజన్ల కాగా రెండు సంవత్సరాలు CSK నిషేధం ఎదుర్కొంది. ఈ 12 సీజన్లలో ఏకంగా 9 సార్లు CSK ఫైనల్ చేరింది. 4 సార్లు టైటిల్ కొట్టింది. ప్రతి మూడేళ్లకు ఒక సారి జట్టులో భారీ మార్పులు జరిగినా, ఆటగాళ్లు మారినా.. ధోని నాయకత్వం చాతుర్యం వల్ల ఇన్ని ఏళ్లు CSKకు ఎదురులేకుండా పోయింది. కానీ.. ఈ సీజన్‌లో ధోని CSK కెప్టెన్సీ నుంచి తప్పుకుని ఆ బాధ్యతను ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు ఇచ్చాడు. మునుపెన్నడూ కెప్టెన్సీ అనుభవం లేని జడేజా CSKను నడిపించడంలో ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తుంది. బౌలింగ్ మార్పులు సరిగా చేయలేకపోతున్నాడనే విమర్శలు వస్తున్నాయి. అందుకే చెన్నై తొలి రెండు వరుస ఓటములతో టోర్నీ ఆరంభంలో ఓటమెరుగని టీమ్ బ్రాండ్‌ను చేజార్చుకుంది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయానలు కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: ఒక వ్యక్తిని ఇంతలా అభిమానిస్తారా? CSK ఫ్యాన్స్ అంటే అంతే మరి..
Taking the hard luck in its stride! #LSGvCSK #WhistlePodu #Yellove 🦁💛 pic.twitter.com/HT2chTMf5o
— Chennai Super Kings (@ChennaiIPL) March 31, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.