ఐపీఎల్ లో చెన్నై విజయానికి కారణమైన రవీంద్ర జడేజా.. మరో మంచిపని చేసి యంగ్ క్రికెటర్ మనసు గెలుచుకున్నాడు. తను విన్నింగ్ షాట్ కొట్టిన బ్యాట్ ని అతడికి గిఫ్ట్ గా ఇచ్చేశాడు.
ఐపీఎల్ మూడ్ నుంచి క్రికెట్ లవర్స్ ఇప్పుడిప్పుడే బయటకొస్తున్నారు. ఎంత గుర్తుచేసుకోవద్దని అనుకుంటున్నాసరే చెన్నై సూపర్ కింగ్స్ విన్నింగ్ మూమెంట్స్ ఫ్యాన్స్ మైండ్ లో నుంచి అస్సలు పోవట్లేదు. మరీ ముఖ్యం ఆ ఫైనల్ ఓవర్ ని అయితే అస్సలు మరిచిపోలేకపోతున్నారు. ఎందుకంటే 2 బంతుల్లో 10 పరుగులు చేయాలి. క్రీజులో జడేజా ఉన్నాడు. స్టేడియం అంతా ఒకటే టెన్షన్. కానీ జడేజా.. 10 రన్స్ కొట్టేసి, చెన్నై ఐదోసారి ట్రోఫీ గెలుచుకోవడంలో కీలకపాత్ర పోషించాడు. ఇప్పుడు అదంతా ఎందుకు చెబుతున్నామంటే ఆ విన్నింగ్ షాట్ కొట్టిన బ్యాట్ ని ఓ యంగ్ క్రికెటర్ కి జడేజా గిఫ్ట్ గా ఇచ్చేశాడు. ఇంతకీ ఎవరా లక్కీ పర్సన్?
ఇక వివరాల్లోకి వెళ్తే.. అహ్మదాబాద్ వేదికగా ఐపీఎల్ ఫైనల్ జరిగింది. ఇదే ధోనీ చివరి సీజన్ అని అందరూ మాట్లాడుకున్నారు. అందుకు తగ్గట్లే లీగ్ దశ నుంచి గెలుస్తూ వచ్చిన సీఎస్కే.. ఇప్పుడు ఏకంగా కప్ కూడా కొట్టేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ 214 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆ తర్వాత దాదాపు మూడు గంటలపాటు వర్షం పడింది. ఆ తర్వాత డక్ వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం చెన్నై టార్గెట్ ని 15 ఓవర్లలో 171 పరుగులుగా నిర్ణయించారు. ఛేదనలో మొదటి నుంచి బాదుడు మొదలుపెట్టిన చెన్నై.. ఎలాగైతేనేం గెలిచేసింది. చివరి ఓవర్ లో అద్భుతం చేసిన జడేజా.. బ్యాటుతో మాయ చేశాడు.
చివరి రెండు బంతుల్లో తను ఫోర్, సిక్స్ కొట్టిన చెన్నైని గెలిపించిన జడేజా.. తన బ్యాటుని జట్టులోనే ఉన్న అజయ్ మండల్ కి ఇచ్చేశాడు. రైట్ ఆర్మ్ స్పిన్నర్ అయిన అజయ్ ని ఈ సీజన్ కోసం జరిగిన వేలంలో చెన్నై సొంతం చేసుకుంది. కానీ మనోడికి మ్యాచ్ లు ఆడే అవకాశం రాలేదు. అయితేనేం జడేజా తన బ్యాటుని గిఫ్ట్ ఇవ్వడంతో అజయ్ గాల్లో తేలిపోతున్నాడు. తన ఇన్ స్టా స్టోరీలో ఇదే విషయాన్ని పోస్ట్ చేశాడు. అలానే జడేజాతో డ్రస్సింగ్ రూమ్ షేర్ చేసుకునే ఛాన్స్ ఇచ్చిన చెన్నై ఫ్రాంచైజీకి థాంక్స్ చెప్పాడు. సో అదనమాట విషయం. జట్టులోని కుర్ర బౌలర్ కి బ్యాట్ గిఫ్ట్ గా ఇచ్చి మరీ జడేజా ఎంకరేజ్ చేయడంపై మీరేం అనుకుంటున్నారు? కింద కామెంట్ చేయండి.
Ravindra Jadeja gifted his bat which he scored the winning run in final to Ajay Mandal. pic.twitter.com/1GGy37LBfD
— Johns. (@CricCrazyJohns) May 31, 2023