‘హర్ష సాయి‘ సోషల్ మీడియాలో ఏ మాత్రం యాక్టివ్‌గా ఉండేవారికైనా ఈ పేరు సుపరిచితమే. ఆపన్నహస్తం కోసం ఎదుచూసే పేదవారికి నేనున్నానంటూ ధైర్యం చెప్పే ప్రముఖ యూట్యూబరే హర్ష సాయి. కష్టకాలంలో ఉన్నవారికి డబ్బు సాయం చేయడం, ఉచితంగా పెట్రోల్ అందించడం, పేద రైతును ఫైవ్ స్టార్ హోటల్‌కు తీసుకెళ్లడం.. ఇలాంటి సంచలనాలన్నీ అతడికే సాధ్యం. అందరూ యూట్యూబర్‌లు వ్యూస్ కోసమో.. డబ్బు కోసమో.. పాపులారిటీ కోసమే వీడియోలు చేస్తుంటారు. కానీ ఇతగాడు చాలా ప్రత్యేకం. ఏ వీడియో చేసినా అందులో ప్రజలకు సాయం చేయడమే తన ప్రధాన కర్తవ్యం. అందుకు తగ్గట్టుగానే ఇతని వీడియోలు ఉంటాయి. అయితే, తాజాగా అలాంటి మంచి మనుసున్న యూట్యూబర్ మరొకరు ముందుకొచ్చారు.
‘జిమ్మీ డొనాల్డ్‌సన్’ ప్రపంచంలోనే ఎక్కువ మంది సబ్‌స్క్రైబర్స్ ఉన్న అమెరికన్ యూట్యూబర్ ఇతడు. ‘మిస్టర్ బీస్ట్’గా పాపులర్ అయిన జిమ్మీకి ప్రస్తుతం యూట్యూబ్ లో దాదాపు 131 మిలియన్ సబ్‌స్క్రైబర్స్ (13 కోట్లకు పైగా) ఉన్నారు. జిమ్మీ.. తన ఛానల్ లో ఏ వీడియో పోస్ట్ చేసినా లక్షల్లో లైకులు, కోట్లలో వ్యూస్ వస్తుంటాయి. అందువల్ల అతడికి భారీ ఆదాయం సమకూరుతుంది. అంతేకాదు 2021లో అత్యధిక ఆదాయం సంపాదించిన యూట్యూబర్‌గా పేరు తెచ్చుకున్నాడు. ఎవరైనా సంపాదించేది.. సంపాదించాలనేది.. ఉన్నంతకాలం సంతోషంగా జీవించాలనే. అంతకుమించి ఆదాయం వస్తోందంటే.. ఉన్నంతలో కొందరకి సహాయం చేయవచ్చు. అలాంటి మంచి పనినే ఎంచుకున్నాడు.. మిస్టర్ బీస్ట్.
I don’t understand why curable blindness is a thing. Why don’t governments step in and help? Even if you’re thinking purely from a financial standpoint it’s hard to see how they don’t roi on taxes from people being able to work again.
— MrBeast (@MrBeast) January 30, 2023
తొలి విడతలో 1,000 మంది పాక్షిక అంధత్వం ఉన్నవాళ్లకు శస్త్రచికిత్స చేయించుకునేందుకు ఆర్ధిక సాయం చేశాడు. ఈ నేపథ్యంలో జమైకా, నమీబియా, హాండురస్, మెక్సికో, ఇండోనేషియా, వియత్నాం, బ్రెజిల్, కెన్యాకు చెందిన పలువురికి ఆపరేషన్లు నిర్వహించారు. అందుకు సంబంధించిన ఒక వీడియోను రెండు రోజుల క్రితం మిస్టర్ బీస్ట్ యూట్యూబ్‌లో పోస్ట్ చేశారు. పాక్షిక దృష్టితో ప్రపంచంలో 200 మిలియన్ల మంది ఉన్నారని వీడియోలో వివరించాడు. తనవంతుగా 1000 మంది సర్జరీ కోసం హెల్ప్ చేశానని చెప్పాడు. “ప్రపంచంలో అంధత్వంతో బాధపడుతున్న వారిలో సగం మందికి 10 నిమిషాల శస్త్రచికిత్సతో కంటిచూపు పోయే రిస్క్ తగ్గిపోతుంది” అని మిస్టర్ బీస్ట్ వివరించారు. ఈ వీడియోలో కంటి సర్జరీకి ముందు, ఆ తర్వాత రోగుల అభిప్రాయాలను కూడా వివరించారు. కాగా, తాను సంపాదించిన దానిలో ఎంతో కొంత మొత్తాన్ని సమాజ సేవకే వినియోగించడం పట్ల జిమ్మీపై ప్రశంసల వర్షం కురుస్తోంది. నెటిజన్లు పెద్ద ఎత్తున అతగాడిని ప్రశంసిస్తున్నారు. ఇతడిపై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.